జర్నలిస్ట్ రామ్మోహన్ నాయుడిని...

ప‌రామ‌ర్శించిన‌ మెగాస్టార్ 

(జానోజాగో వెబ్ న్యూస్-సినిమా బ్యూరో)

ఆప‌ద‌లో ఆదుకునేందుకు ఆప‌న్న‌హ‌స్తం అందించేందుకు మెగాస్టార్ నేనున్నాన‌ని ముందుకు వ‌స్తారు. అలా ఎంద‌రినో ఆదుకున్నారు. తీవ్ర అనారోగ్యంతో గత మూడు నెలలుగా చికిత్స పొందుతున్న ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ రామ్మోహన్ నాయుడికి ఆస్ప‌త్రి చికిత్స అందించ‌డ‌మే గాక ఆదివారం రోజు    ఆయ‌న‌ను పరామర్శించారు. ఆరోగ్యం బాగా లేదన్న విషయం తెలిసిన వెంటనే స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి మరీ  ధైర్యం చెప్పడమే కాకుండా.. స్వస్థత చేకూరేందుకు అన్ని రకాల ఆదుకుంటామని చిరు హామీ ఇచ్చారు. వెంటనే ఆయన్ని మెరుగైన వైద్యం కోసం హైద్రాబాద్ AIG హాస్పిటల్ లో చికిత్స‌ను అందించే ఏర్పాటు చేశారు. జ‌ర్న‌లిస్ట్ రామ్మోహ‌న్ నాయుడు ప్ర‌జారాజ్యం పార్టీ కార్య‌క‌లాపాల్లో చురుకైన పాత్ర‌ను పోషించారు.
``ప్రలోభాలకు లొంగకుండా నమ్మిన సిద్ధాంతం ప్రకారం ఉన్నది ఉన్నట్లుగా రాసే జర్నలిస్టుగా రామ్మోహన్ నాయుడుకి ఎంతో పేరు ఉంద``ని ఈ సందర్భంగా శ్రీ చిరంజీవి  ప్రశంసించారు. ఇలా నిబద్ధత కలిగిన పాత్రికేయులను  కాపాడుకోవాల్సిన బాధ్యత సమాజంపై ఎంతో ఉందని ఆయ‌న త్వ‌ర‌గా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఓవైపు ఆచార్య షూటింగ్... మ‌రోవైపు నిహారిక వివాహ‌మ‌హోత్స‌వం సంద‌ర్భంగా బిజీలోనూ చిరు ఇలా ప‌రామ‌ర్శ‌కు వ‌చ్చారు.


 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: