కర్నూల్ కార్పోరేషన్ లోనూ పతంగ్ ఎగరవేస్తాం

ఎంఐఎం కర్నూలు పట్టణ అధ్యక్షులు ఎస్ మన్సూర్

గ్రేటర్ హైదరాబాద్ లో ఎంఐఎం విజయంపై కర్నూలులో సంబరాలు(జానో జాగో వెబ్ న్యూస్ కర్నూలు పట్టణ ప్రతినిధి)

కర్నూలు కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో నూ ఎంఐఎం పార్టీ జెండాను ఎగర వేస్తామని కర్నూలు పట్టణ ఎంఐఎం అధ్యక్షులు ఎస్ మన్సూర్ పేర్కొన్నారు. .ఎంఐఎం పార్టీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో సాధించిన విజయంపై కర్నూలు పట్టణంలో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నాయి. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో  పట్టణ అధ్యక్షులు ఎస్ మన్సూర్ మాట్లాడుతూ రాబోవు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ ఎంఐఎం జెండా ఎగర వేయాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు.

ఇందుకోసం పార్టీ శ్రేణులు పార్టీని విజయం దిశగా నడిపించేందుకు సమాయత్తం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి ఇంటికి తీసుకెళ్లి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో సాధించిన విజయం తరహా విజయం కర్నూల్ లోనూ సాధించే దిశగా పార్టీ కార్యకర్తలంతా శ్రమించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమం లో మజాహర్ అమీర్ సయ్యద్ బాషా సబీర్ ఖాన్ చాంద్ తదితరులు పాల్గొన్నారు.

 


 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: