సోనియా లేకుంటే తెలంగాణ సాధ్యమయ్యేదా

జి.నిరంజన్

ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు

(జానోజాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)

రాజీవ్ గాంధీ సద్భావనా యాత్రా స్మారక సమితి అధ్వర్యములో చార్మినార్ వద్ద అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధి 74వ జన్మ దినోత్సవ వేడుకలు ఘనముగా జరుపుకున్నారు. ఈ సందర్భముగా రాజీవ్ గాంధీ సద్భావనా యాత్రా స్మారక స్థంభము పై స్మారక సమితి అధ్యక్షులు జి.నిరంజన్ కాంగ్రెస్ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు.

అనంతరం జి.నిరంజన్ మాట్లాడుతూ... మెట్టినింటి బిడ్డగా సొనియా గాంధీ భారత దేశాభివృద్దికి, జాతీయ సమైక్యతకు, పరమత సహనము పెంచడానికి చేస్తున్న కృషిని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా, యు.పి.ఎ చైర్ పర్సన్ గా ఆమె సేవలు ప్రజలు ఎల్లప్పుడూ గుర్తు పెట్టుకుంటారని తెలిపారు. సొనియా లేకుంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రము సాధ్యమయ్యేది కాదని తెలంగాణా ప్రజలు ఆమెకు ఎల్లప్పుడూ ఋణ పడి ఉంటారన్నారు.  ఆమెకు ఆయురారోగ్యాలు ప్రసాడించాలని సభికులు భగవంతుడిని ప్రార్థిస్తూ అందరికీ పండ్లను అందజేశారు. ఈ కార్యక్రమములో జి.కన్నయ్య లాల్, యూసుఫ్ హాష్మి, ఓం ప్రకాశ్ శర్మ,, మూసా ఖాసిం, పి.రాజేష్ కుమార్, జి.దినేశ్, ఎమ్.విజయ్ కుమార్, అశోక్ రెడ్డి, మనోహర్, ఎక్బాల్ తది తరులు పాల్గొన్నారు.



 


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: