మనువాదంపై పోరాడిన యోధడు అంబేద్కర్

జానోజాగో, ఐయూఎంఎల్ నేతల వెల్లడి

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

ఐయూఎంఎల్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి సలాం మౌలానా  అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో  జానోజాగో(ముస్లింల అభివృద్ది వేదిక) సంఘం జాతీయ కార్యదర్శి సయ్యద్ మహబూబ్ బాషా, ఐయుఎంఎల్ జిల్లా కార్యదర్శి సలాం మౌలానా మాట్లాడుతూ ప్రపంచ మేధావి, నవభారత రాజ్యాంగ నిర్మాత, సకల  హక్కుల సంరక్షకుడు, బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 1956 డిసెంబర్ 6 తనువు చాలించారని పేర్కొన్నారు. దళితులు, నిమ్న వర్గాలు  మాత్రమే కాకుండా, యావత్ ప్రపంచమే నిర్ఘాంతపోయిన రోజు అని వారు పేర్కొన్నారు.

 



బాబాసాహెబ్ మరణం ప్రపంచానికి తీరని లోటు ఆయన యుగయుగాలుగా తరతరాలుగా మనిషి మనిషినీ దూరం చేసిన మనువాదన్ని సమూలంగా నాశనం చేసి నవ భారత రాజ్యాంగాన్ని రూపొందించిన అభినవ పురుషుడు అని వారు కొనియాడారు.  ఆ మహానుభావుడు భారత సమాజాన్ని ఏ విధంగా రూపొందించాలని భారత రాజ్యాంగాన్ని రచించాడో అది నేటికీ సాధ్యం కాలేదు  అంటరానితనాన్ని నిర్మూలించేందుకు కుల రహిత సమాజాన్ని స్థాపించేందుకు తన జీవిత సర్వస్వం త్యాగం చేసిన మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కులమతాలకతీతంగా ప్రతి మనిషికి స్వేచ్ఛ స్వతంత్రాలతో   కూడిన జీవనం అవసరమని అందు కోసం నిరంతరం పోరాడిన యోధుడు అని వారు ప్రశంసించారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: