ఎమ్యెల్యే వైఖరిని ఖండిస్తున్నాం
టీయూడబ్ల్యూజే
(జానోజాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)
అధికార మదంతో పటాన్ చెరువు వార్త విలేకరి సంతోష్ నాయక్ ను అసభ్యకర పదజాలంతో దూషించిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి వ్యాఖ్యలను తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు నగునూరి శేఖర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. భూబకాసరుడైన ఎమ్యెల్యే మహిపాల్ రెడ్డి గుట్టును బయటపెట్టిన జర్నలిస్టును ఫోన్లో బెదిరించడం, సభ్యసమాజం తలదించుకునే విధంగా వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటుగా భావిస్తున్నాం. విధి రౌడీలాగా ప్రవర్తించిన మహిపాల్ రెడ్డికి సరైన రీతిలో బుద్దిచెబుతాం. అని వారు హెచ్చరించారు.
Post A Comment:
0 comments: