ఐఐటిలో సిటు సాధించిన...
రావూస్ జూనియర్ కళాశాల విద్యార్థి
అభినందిస్తున్న ప్రిన్సిపాల్
(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)
రావూస్ జూనియర్ కళాశాల కె.రాహుల్ అనే విద్యార్థి (Indian Institute of Technology) IIT తిరుపతి నందు Civil engineering సీటు సాధించారని, అలాగే P. చందు భార్గవ్ IIIT కర్నూలు నందు కంప్యూటర్ ఇంజనీరింగ్ సీటు, సి రమేష్ అనే విద్యార్థి NIT తాడేపల్లిగూడెం నందు మెకానికల్ సీటు సాధించినట్లు కళాశాల చైర్మన్ AMV అప్పారావు తెలిపారు. సీట్లు సాధించిన విద్యార్థులను కళాశాల ప్రిన్సిపల్ రోడ్డ సుంకయ్య సన్మానిస్తూ నంద్యాల నందు IIT సీటు సాధించడం అనేది ఒక రాహుల్ కళాశాల విద్యార్థులకు మాత్రమే సాధ్యమని గత 12 సంవత్సరాల క్రితం కూడా రావూస్ కళాశాల విద్యార్థి IIT సీటు సాధించినట్లు తెలిపారు. ఒక తాలూకా కేంద్రంలో గత 30 సంవత్సరాలుగా ఓకే కళాశాల క్రమం తప్పకుండా IIT సీట్లు NIT సీటు సాధించడం రావుస్ కళాశాల విద్యార్థులకే సాధ్యమని తెలిపారు. అలాగే ఈ విద్యా సంవత్సరం నందు MBBS సీటు, BDS సీటు, వెటర్నరీ నందు ఇద్దరు విద్యార్థులు, అగ్రికల్చర్ బీఎస్సీ నందు నలుగురు విద్యార్థులు సాధించారని రోడ్డసుంకయ్య తెలిపారు. ఈ విద్యా సంవత్సరం నుండి జేఈఈ ఈ మెయిన్స్ నందు క్వాలిఫై అయిన విద్యార్థులకు Advanced కోచింగ్ ఇస్తున్నట్లు తెలిపారు. అలాగే బైపీసీ పాసైన విద్యార్థులకు Long Term NEET కోచింగ్ గత ఆరు సంవత్సరాల నుండి కోచింగ్ ఇస్తూ ఎంతోమంది విద్యార్థుల కు మెడికల్ సీటు సాధించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో లో వైస్ ప్రిన్సిపల్ డి జగదీశ్వరరావు, JEE,NEET, అధ్యాపకులు పాల్గొన్నారు.
Post A Comment:
0 comments: