సీబీఐ తో విచారణ చేయించండి
అబ్దుల్ సలాంకు న్యాయం చేయండి
కర్నూలు జిల్లా కలెక్టర్, ఎస్పీకి అబ్దుల్ సలాం న్యాయ పోరాట కమిటీ వినతి
(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)
సీబీఐ విచారణ చేయించి అబ్దుల్ సలాం కుటుంభానికి న్యాయం చేయాలని కోరుతూ నంద్యాల అబ్దుల్ సలాం న్యాయ పోరాట కమిటీ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా కలెక్టర్, ఎస్పీకి విజ్ఞాపన పత్రం సమర్పించారు. గురువారంనాడు చలో కర్నూలు కార్యక్రమాల్లో అబ్దుల్ సలాం నాయ పోరాట కమిటీ రాష్ట్ర కన్వీనర్ మౌలానా ముస్తాక్ అహ్మద్, మత పెద్ద అబ్దుల్ హాజీ ,ఆవాజ్ జిల్లా కన్వీనర్ మస్తాన్ వలి, ఇన్సాఫ్ జిల్లా నాయకులు బాబా ఫక్రుద్దీన్, జానోజాగో(ముస్లింల అభివృద్ది వేదిక) సంఘం జాతీయ కార్యదర్శి సయ్యద్ మహబూబ్ బాషా, పిడిఎస్ యూ జిల్లా సహాయ కార్యదర్శి రఫీ,ఆవాజ్ పట్టణ అధ్యక్షులు బాబుల్లా, లౌకిక రాజ్యాంగం పరిరక్షణ వేదిక డివిజన్ నాయకులు ఖాజా ఫారీద్,జకీర్, ఎంఆర్ఎఫ్ డివిజన్ అధ్యక్షులు మహబూబ్ బాషా, ఆవాజ్ నంద్యాల మండల అధ్యక్షులు అక్రమ్, సామాజిక కార్యకర్త సుహైల్, మరియు అబ్దుల్ కలాంనే పోరాట కమిటీ నాయకులు కార్యకర్తలు చలో కర్నూలు కార్యక్రమంలో కర్నూలుకు వెళ్లారు.
నవంబర్ 3వ తేదీ నంద్యాల పట్టణంలోని అబ్దుస్సలామ్ అనే వ్యక్తి కవులూరు గ్రామం వద్ద భార్య ఇద్దరు పిల్లలు తన కుటుంబంతో సహా రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఈ సంఘటన మీకు విధితమే నంద్యాలలో ముస్లిం ప్రజాసంఘాలు అన్నీ కలిసి అబ్దుల్ సలామ్ న్యాయపోరాటం కమిటీగా ఏర్పడి ఇది ఆత్మహత్య కాదు పోలీసులు హత్య కావున సిబిఐ విచారణ జరిపించాలని దొంగతనం జరిగిన ఆత్మహత్య చేసుకుని పోస్టుమార్టం జరిగిన అంతవరకు స్థానిక వైసిపి ఎమ్మెల్యేనిమిషాంబ బంగారు అంగడి యజమాని అధికార పార్టీకి చెందిన బంగారు అంగడి గంగిశెట్టి శ్రీధర్ మరియు ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ సీఐ సోమశేఖర్ రెడ్డి క్రైమ్ హెడ్ కానిస్టేబుల్ గంగాధర్ మరియు ముగ్గురు కానిస్టేబుల్ ఫోన్ కాల్ డేటా కోర్టుకు సమర్పించాలి హెడ్ కానిస్టేబుల్ ను మరియు ముగ్గురు కానిస్టేబుళ్లను తక్షణమే అరెస్ట్ చేసి శాశ్వతంగా ఉద్యోగాల నుండి తొలగించాలి వారి ఆస్తులపై అవినీతి నిరోధక శాఖ వారితో అధ్యాయ పన్ను శాఖ అధికారులతో ఒకేసారి దర్యాప్తు చేయించాలి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా సర్వ త్వమే విచారణ చేసి దోషులను శిక్షిస్తూ చనిపోయిన అబ్దుస్సలామ్ కుటుంబానికి న్యాయం చేయాలని అప్పుడే ఆ కుటుంబానికి ఆత్మ శాంతి కలుగుతుందని అబ్దుల్ న్యాయ పోరాట కమిటీ అభిప్రాయపడుతూ మీ ద్వారా శాసనసభ మరియు శాసనమండలిలో చర్చించి న్యాయం చేస్తానని . తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ విచారణ కమిటీ ఏర్పాటు చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరించడం జరిగింది.
Post A Comment:
0 comments: