బువ్వ తీసి ప్రాణం పోసే అన్న దాతలపై... ఊపిరి తీసే చట్టాలు -
మనకెందుకులే అనుకుందామా...నిగ్గ దీసి ప్రశ్నిద్దామా
(జానోజాగో వెబ్ న్యూస్-హిందూపురం ప్రతినిధి)
అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలో రైతులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం చేసిన నల్ల చట్టాల ను వెనక్కు తీసుకోవాలని ప్రజా సంఘాలు చేసిన భారత్ బంద్ శాంతి యుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున కార్మిక కర్షక ట్రేడ్ యూనియన్ సంఘాలు నాయకులు కార్మికులు పాల్గొన్నారు. ఆర్&బీ బంగ్లా నుంచి అన్ని ప్రజా సంఘాలు ర్యాలీగా పట్టణం లో ర్యాలీ నిర్వహిస్తూ కేంద్ర ప్రభుత్వ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అంబేద్కర్ సర్కిల్ లో ప్రసంగాలు చేశారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఇంతియాజ్, కాంగ్రెస్ నాయకులు బాలాజీ, మనోహర్, వినోద్. ముస్లిం నగారా అధ్యక్షులు ఉమర్ ఫారూఖ్ ఖాన్, సీపీఐ నాయకులు దాదాపీర్. రైతు సంఘం నాయకులు సిద్దారెడ్డి. చైతన్య గంగిరెడ్డి. యునైటెడ్ సిఖ్ మోహిందీర్ జీత్ సింగ్.సిఖ్ సంఘట్ పల్వీoదర్ సింగ్ టిప్పు సుల్తాన్ నాయకులు షేక్ షబ్బీర్.ఎస్ ఎఫ్ ఐ బాబావలి కాంగ్రెస్ యువజన నాయకుడు సంపత్ సిల్క్ రీలర్స్ అసోషియేషన్.ఆటో వర్కర్ అసోషియేషన్.అన్ని ప్రజాసంఘాలు పాల్గొని భారత్ బంద్ ను విజయ వంతం చేశాయి ఉమర్ ఫారూఖ్ ఖాన్ రైతుల బాధలపై కవితను వ్రాసి వినిపించారు.
Post A Comment:
0 comments: