వారిని వెంటనే అరెస్టు చేయాలి
పీవైఎల్. పీడిఎస్ యూ డిమాండ్
(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)
కర్నూలు జిల్లా, బండి ఆత్మకూరు మండలం, ఓంకారం దేవస్థానం పూజారుల పై దాడి చేసిన వైకాపా నాయకుడు, ఆలయ అధ్యక్షుడు పిట్టo ప్రతాపరెడ్డి ని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని పి డి ఎస్ యు , పీ వై ఎల్ నాయకులు తీవ్రంగా ఖండించారు.నంద్యాల పట్టణంలో ఉన్న సాయి బాబా నగర్ లోని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ కార్యాలయంలో పిడిఎస్యు జిల్లా సహాయ కార్యదర్శి S.M.D.రఫీ, పీ వై ఎల్ జిల్లా నాయకులు నవీన్ మాట్లాడుతూ కర్నూలు జిల్లా బండి ఆత్మకూరు మండలం ఓంకారం దేవస్థానంలో ఆలయానికి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఆలయ నిబంధనల ప్రకారం రాత్రివేళ టికెట్లు ఇవ్వకూడదు అని గుర్తు చేసినటువంటి పూజార్ల పై దాడి చేయడం చాలా బాధాకరమని, ప్రభుత్వ అధికారులు అయినా,ప్రజా ప్రతినిధులు అయినా, ఎవరికైనా నిబంధనలు వర్తిస్తాయని,కానీ అలాంటి నిబంధనలు ఉల్లంఘించ వద్దని చెబితే మమ్మల్ని ప్రశ్నిస్తారా, మాకు ఎదురు చెబుతున్నారని భావించి దాడి చేయడం సిగ్గుచేటని అన్నారు, వెంటనే వారిని అరెస్టు చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు.
Post A Comment:
0 comments: