సమాజానికి సేవ చేయాలి
- ఎస్సీ, ఎస్పీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యురాలు మమతా రెడ్డి
పబ్లిక్ ప్రాసిక్యూటరును సన్మానిస్తున్న మమతా రెడ్డి
( జానో జాగో వెబ్ న్యూస్ -కర్నూలు జిల్లా ప్రతినిధి)
మూడవ అదనపు జిల్లా అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ నాగమణి గత రెండు రోజుల క్రితం కర్నూల్ నుండి బదిలీ అయి నంద్యాల కోర్టులో బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఎస్సీ, ఎస్టీ, విజిలెన్స్ మానిటరింగ్ కమిటి సభ్యురాలు మమతా రెడ్డి పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను కలిసి ఆహ్వానం తెలపడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భగా ఆమె మాట్లాడుతూ ఇటీవల రెండు రోజుల క్రితం బదిలీపై నంద్యాలకు వచ్చిన మూడవ అదనపు జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ నాగమణిని సాదరంగా ఆహ్వానించడం జరిగిందని అలాగే శాలువాతో
చిన్నపాటి సత్కారం చేయడం జరిగిందని తెలిపారు. పేద ప్రజలకు ఆమె ఎంతోకాలంగా సేవలు అందిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ, విజిలెన్స్ కమిటి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment:
0 comments: