ఇళ్లస్థలాల పంపిణీలో ప్రభుత్వ నిర్లక్ష్యం తగదు
ఏపీ చేతివృత్తి దారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర కన్వీనర్ కె.రామాంజనేయులు
(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)
పేదలకు ఇళ్లస్థలాల పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం తగదని ఏపీ చేతివృత్తి దారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర కన్వీనర్ కె.రామాంజనేయులు పేర్కొన్నారు. నిరుపేదలకు ఇళ్లపట్టాల విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నదని,గ్రామీణ ప్రాంతాల్లో 2 సెంట్లు,పట్టణ ప్రాంతల్లో 3 సెంట్లు ఇవ్వాలని కోరుతూ ఎపి చేతివృత్తి దారుల సంఘాల సమాఖ్య,ఆంద్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం,ఏపీ గిరిజన సమాఖ్య,దళిత హక్కుల పోరాట సమితి ల రాష్ట్ర పిలుపులో భాగంగా నంద్యాల సీపీఐ కార్యాలయంలో బికెఎంయూ నంద్యాల డివిజన్ కార్యదర్శి సుబ్బారాయుడు అధ్యక్షతన జరిగిన "రౌండ్ టేబుల్ సమావేశంలో" ఎపి చేతివృత్తి సంఘాల సమాఖ్య రాష్ట్ర కన్వీనర్ కే. రామాంజనేయులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఏపీ చేతివృత్తి దారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర కన్వీనర్ కే. రామాంజనేయులు మాట్లాడుతూ ఆంద్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ఇళ్లస్థలాల విషయంలో చాలా దారుణంగా వ్యవహరిస్తున్నదని అందుకు నిదర్శనం గ్రామీణ ప్రాంతాల్లో కేవలం 1:50 సెంట్ స్థలం,పట్టణ ప్రాంతాల్లో 1 సెంటు స్థలాలు ఇవ్వడం ఏంటని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.అంతే కాకుండా గత ప్రభుత్వంలో నిధులు విడుదల అయ్యాయనే నెపంతో టిడ్కో గృహలను పూర్తి చేయకుండా,ఒకవేళ పూర్తి అయిన చోట ఎటువంటి మౌలిక సదుపాయాలు కల్పించకుండా,కొన్ని చోట్లా పూర్తి అయిన ఇళ్లను కూడా ప్రజలకు ఇవ్వకుండా వైసీపీ ప్రభుత్వం చేస్తున్న ప్రచారాలు వెంటనే ఆపివేసి,కోర్టులో పెండింగ్ లేకుండా పూర్తి అయిన అన్ని ప్రాంతాల్లో సింగల్ బెడ్ రూమ్ ఉన్న ఇళ్లను,డబుల్ బెడ్ రూమ్ ఇళ్లుగా మార్చి వెంటనే పూర్తి చేసి పేద ప్రజలకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.అంతే కాకుండా ఇళ్ల స్థలాల పంపిణీ విషయంలో కూడా ప్రభుత్వం పునరాలోచన చేసి గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు,పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇళ్ల పట్టాలు ఇచ్చి పేద ప్రజలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఈ రోజు నంద్యాల సీపీఐ కార్యాలయంలో జరిగిన రౌండ్ టేబుల్ వేదికగా ప్రభుత్వాన్ని తెలియజేసారు.కావున రాష్ట్ర ప్రభుత్వం అవైపున ఆలోచన చేసి వెంటనే పై డిమాండ్లను సత్వరమే పరిష్కరించకపోతే ఎపి చేతివృత్తి దారుల సంఘాల సమాఖ్య,ఆంద్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం,ఏపీ గిరిజన సమాఖ్య,దళిత హక్కుల పోరాట సమితి సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమ కార్యాచరణ రూపొందించి ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఇన్సాఫ్ కమిటీ జిల్లా నాయకులు బాబా ఫక్రుద్దీన్,
ఏఐవైఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి.నాగరాముడు, డిహెచ్ పిఎస్ నంద్యాల డివిజన్ కన్వీనర్ ప్రసాద్,ఏపీ గిరిజన సమాఖ్య నంద్యాల డివిజన్ కార్యదర్శి నరసింహ,ఇన్సాఫ్ కమిటీ నంద్యాల నాయకులు షరీఫ్ బాషా, ఐఎఫ్ టీయూ జిల్లా సహాయ కార్యదర్శి శంకర్, ఐఎఫ్ టీయూ నంద్యాల అధ్యక్షుడు చౌదప్ప, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు ధనుంజయుడు, ఎఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ నంద్యాల డివిజన్ కార్యదర్శులు సురేష్,విష్ణు,బీసీ,ఎస్సి,ఎస్టీ,మైనార్టీ విద్యార్థి యువజన సమాఖ్య జిల్లా అధ్యక్షుడు శివకృష్ణ,GVS జిల్లా అధ్యక్షుడు రవీంద్ర నాయక్ లు పాల్గొన్నారు.
Post A Comment:
0 comments: