సాయినాథుడి సేవలో పాల్గొనేందుకు అవకాశం
పేరు నమోదు చేసుకుంటే టోకెన్
( జానో జాగో వెబ్ న్యూస్ త--ర్లుపాడు ప్రతినిధి)
షిరిడి నందు సాయినాధునిచే 10-12-1910వ తేదిన ప్రారంభించిన శేజహారతి 110 సంవత్సరాలు ముగించికొని డిసెంబర్ 10వ తేది2020కు 111 సంవత్సరాలలో అడుగుపెట్టిన సందర్భంగా షిరిడి క్షేత్రమును అనుసంధానం చేసికొని దేశవ్యాప్తంగా విశ్వకళ్యాణంకొరకు డిసెంబర్ 10వ తేది రాత్రి 10:30 గంటలకు నిర్వహించే గ్లోబల్ హారతి నందు 111 మంది భక్తులచే ధునిలో టెంకాయలు వేయించి 111 ప్రమిదలు మందిరంలో వెలిగించి 111 మందితో బాబాకు శేజ హారతి ఇప్పించబడును. ఈ సేవలో పాల్గొనుటకు 111 మందికి మాత్రమే అవకాశం కలదు, ఎవరు ముందు పేరు నమోదు చేసుకుంటే వారికి టోకెన్ ఇవ్వబడును. టెంకాయ, ప్రమిదలు వారే ఏర్పాటు చేసికొనవలెను. పూర్తిగా ఉచితం ఎటువంటి రుసుము లేదు. వారి పేర్లను శ్రీ శిరిడి సాయి మందిరం, తర్లుపాడు గ్రామంలో కోటేశ్వరరావు వద్ద నమోదు చేసుకొని టోకెన్ పొందవలసిందిగా మందిరం యొక్క ఛైర్మన్ మాదాల నాగమల్లికార్జున తెలియచేశారు.
Post A Comment:
0 comments: