ఆ చట్టాలను కేంద్రం ఉపసంహరించుకోవాలి
జానోజాగో సంఘం డిమాండ్
జానోజాగో సంఘం జాతీయ అధ్యక్షులు సయ్యద్ నిసార్ అహ్మద్
(జానోజాగో వెబ్ న్యూస్-ఏపీ ప్రతినిధి)
రైతు వ్యతిరేక చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉప సంహరించుకోవాలని జానోజాగో(ముస్లింల అభివృద్ది వేదిక) సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు జానోజాగో సంఘం జాతీయ అధ్యక్షులు సయ్యద్ నిసార్ అహ్మద్, జాతీయ కార్యదర్శి సయ్యద్ మహబూబ్ బాషా సంయుక్తంగా ఓ ప్రకటన విడుదల చేశారు. మంగళవారంనాడు జరిగిన భారత్ బంద్ లో రెండు తెలుగు రాష్ట్రాల్లోని జానోజాగో సంఘం నేతలు కూడా పెద్ద ఎత్తున్న పాల్గొన్నారని వారు వెల్లడించారు.
జానోజాగో సంఘం జాతీయ కార్యదర్శి సయ్యద్ మహబూబ్ బాషా
రైతుల నుంచి వస్తున్న వ్యతిరేకతను చూసైనా సరే కేంద్రం ఆ చట్టాలను వెనక్కి తీసుకోవాలని వారు కోరారు. రైతులు ఇంతగా వ్యతిరేకిస్తున్నా కేంద్రం దున్నపోతు నిద్ర పోతోందని వారు విమర్శించారు. ప్రజాగ్రహాన్ని చూసిన ఏ ప్రభుత్వం నిలబడలేదన్నారు. బీజేపీ కి కూడా ఇదే గతి పడుతుందని వారు హెచ్చరించారు. కేంద్రం తీసుకొచ్చిన రైతు బిల్లులపై తన వైఖరి ఏమిటో వైసీపీ ప్రభుత్వం కూడా స్పష్టంచేయాలని వారు డిమాండ్ చేశారు.
Post A Comment:
0 comments: