మామూళ్లు తీసుకుంటూ తనిఖీల విస్మరణ

ప్రైవేటు స్కూళ్లపై విద్యాశాఖాధికారుల తీరు ఇది 

ఎఐఎస్ఎఫ్, విద్యార్థి సంఘాల మండిపాటు

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న సత్యసాయి స్కూల్ పై చర్యలు తీసుకోకపోతే ఎంఇఒ, డిఇఒ కార్యాలయాలు ముట్టడిస్తామని ఎఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు ధనుంజయుడు, విద్యార్థి సంఘాల నాయకులు నిరంజన్, రఫీ, రవీంద్ర నాయక్,  శివకృష్ణ యాదవ్ లు డిమాండ్ చేశారు. నంద్యాల పద్మావతి నగర్లో మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో ఉన్న సత్యసాయి స్కూల్ యాజమాన్యం ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న కూడా, విద్యార్థుల తల్లిదండ్రులను బెదిరిస్తున్న కూడా, అమ్మవడి డబ్బులలో వాటా అడుగుతున్న కూడా, ఫిట్ నెస్ లేని బస్ లు నడుపుతున్న కూడా, మౌలిక సదుపాయాలు లేకుండా, రేకుల షెడ్డులలో తరగతులు నడుపుతున్న కూడా, వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తున్న కూడా విద్యాశాఖ అధికారులు ఎందుకు ఆ స్కూల్ ను తనిఖీ చేయడం లేదని, ఆ పాఠశాల నుండి విద్యాశాఖ అధికారులకు ముడుపులు ముట్టుతున్నాయని, అందుకే కల్లుండి కూడా అధికారులు అవినీతిని అడ్డుకోలేక పోతున్నారని వారన్నారు. నంద్యాల మండలంలో ఉన్న ఎంఇఓ నేమో రోజు ఏదొక క్యాంప్ ఉందని అస్సలు ఎంఇఓ కార్యాలయంలోనే ఉండరు, డి.డిఇఓ మీనాక్షి గారేమో నేను అస్సలు నంద్యాలకు వచ్చేది లేదు, మొత్తం నంద్యాల ఉప విద్యాశాఖ కార్యాలయాన్ని మొత్తం తమ స్టాఫ్ కు అప్పజెప్పి యతేచ్ఛగా కర్నూల్ లో తిరుగుతున్నారని ఈ విధంగా నంద్యాలలో విద్యాశాఖ అధికారుల పనితీరు ఉంటే  ఎవరు చూసుకోవాలని నంద్యాల విద్యాశాఖ అధికారుల బాధ్యతలను అని ఎఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్ యూ, జీవిఎస్, బీసీ, ఎస్సి, ఎస్టీ, మైనార్టీ విద్యార్థి, యువజన సమాఖ్య నాయకులు ప్రశ్నించారు. కావున తక్షణమే నంద్యాల లో అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న సత్యసాయి స్కూల్ యాజమాన్యంపై తనిఖీలు నిర్వహించి, చర్యలు తీసుకోకపోతే మీ కార్యాలయాలు ముట్టడిస్తామని  ఆ సంఘాల నాయకులు విద్యాశాఖ అధికారులను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి, యువజన సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: