ప్రపంచ మేధావి అంబేద్కర్

ఎమ్మార్పీఎస్, ప్రజా సంఘాల నివాళి

(జానోజాగో వెబ్ న్యూస్-హిందూపూరం ప్రతినిధి)

అనంతపురం జిల్లా హిందూపురంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 64వ వర్ధంతిని ఎమ్మార్పీఎస్, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ సర్కిల్ నందు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ తాలూకా అధ్యక్షులు సతీష్ కుమార్, ముస్లిం నగారా ",టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్  అధ్యక్షులు ఉమర్ ఫరూక్ ఖాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా  వారు మాట్లాడుతూ మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ పీడిత అణగారిన ప్రజల సమానత్వం కోసం అందించిన రాజ్యాంగం రక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాజ్యాంగాన్ని పాఠ్యాంశంగా ప్రవేశ పెట్టాలని దీనికోసం అసెంబ్లీ పార్లమెంటులో చట్టం చేయాలని ఉద్యమించా లని పిలుపునిచ్చారు.

ఎం ఈ ఎఫ్ రామకృష్ణ. మల్లికార్జున, ఎస్ టి  సెల్ రమణ, ఎన్ ఎస్ యు ఐ నాయకులు సంపత్, పోస్టల్ హనుమంతప్ప, కౌన్సిలర్ రెహ్మాన్, బి ఎస్ పి శంకర్ కొట్నూరు కిష్టప్ప, మేలపురం యువత పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రపంచ మేధావి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. నిన్నటి రోజు హిందూపురం నడిబొడ్డులో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి మూల కారకులు విగ్రహ దాత మాజీ మున్సిపల్ ఛైర్మన్ దశరధ రామయ్య  పరమపదించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఎమ్మార్పీఎస్, ప్రజా  సంఘాల తరఫున రెండు నిమిషాలు మౌనం పాటించడం జరిగింది.



 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: