సివిల్ కేసులను న్యాయవ్యవస్థ ద్వారానే పరిష్కరించుకోవాలి

- నంద్యాల సబ్ కలెక్టర్ కల్పనా కుమారి

-


(జానో జాగో  న్యూస్- కర్నూలు జిల్లా ప్రతినిధి)

 సివిల్ కేసులను న్యాయవ్యవస్థ ద్వారానే పరిష్కరించుకోవాలని నంద్యాల సబ్ కలెక్టర్ కల్పనా కుమారి అన్నారు. సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ కల్పనా కుమారి, కార్యాలయం పరిపాలనాధికారి హరినాథ్ రావుతో కలిసి వినతులు స్వీకరించారు. అనంతరం సబ్ కలెక్టర్ కల్పనా కుమారి మాట్లాడుతూ నంద్యాల డివిజన్లో కొంత మంది ప్రజలు సివిల్ కు సంబంధించిన వినతులను సోమవారం జరిగిన గ్రీవెన్స్ లో సమర్పించుకున్నారని, అలా కాకుండా సివిల్ కు సంబంధించినటువంటి సమస్యలన్నియు న్యాయ వ్యవస్థ ద్వారానే పరిష్కరించుకోవాలని సూచించారు.


 

నంద్యాల డివిజన్లో రేషన్ కార్డుల మ్యాపింగ్ ముమ్మరంగా జరుగుచున్నదని,  రెండు మూడు రోజుల్లో ఈ మ్యాపింగ్ వర్క్ పూర్తి అవుతుందని తెలియజేశారు. వినతులు సమర్పించే వినతిదారులు వారివారి వినతులను మన ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సచివాలయ వ్యవస్థ నందు సమర్పించుకోవాలన్నారు. గ్రామాలలో గ్రామ సచివాలయాలు,  పురపాలక సంఘాల యందు వార్డు సచివాలయం ఏర్పాటు చేసి ఉన్నాయని, సచివాలయంల యందు కూడా వినతులను స్వీకరించుతారని ఆమె అన్నారు. ఈరోజు జరిగిన గ్రీవెన్స్ నందు భూ తగాధల గురించి కుటుంబ సమస్యలను గురించి పంట పొలాలకు రాస్తా కావాలని, మా భూముల వివరాలు ఆన్లైన్లో నమోదు చేయలేదని, వృద్ధాప్య పింఛన్లు కావాలని, కోవెలకుంట్ల పట్టణమందు వృద్ధాశ్రమం కొరకు స్థలం కావాలని  కోరుతూ వినతులు అందాయన్నారు. ఈరోజు జరిగిన గ్రీవెన్స్ నందు  14 వినతులు అందాయన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: