ఆటో బోల్తా...ఒకరి పరిస్థితి విషమంగా

(జానోజాగో వెబ్ న్యూస్-తర్లుపాడు ప్రతినిధి)

     ప్రకాశం జిల్లా  తర్లుపాడు మండల పరిధిలో   తాడి వారి పల్లి సమీపంలో ఘాట్ రోడ్ లో ఆటో బోల్తా పడింది, ఒకరి పరిస్థితి విషమంగా మారింది. కూలీలు గల ఆటో బోల్తా పడడం జరిగింది. ఈ ఆటో నెంబర్(AP27TX4877) 12 మంది కూలీలు. తాడి వారి పల్లి నుండి వేములపాడు పొలం పనులకు వెళ్ళుటకు   ప్రయాణిస్తుండగా ఘాట్ రోడ్ లో బ్రేక్ ఫెయిల్ కారణంగా బోల్తా పడింది. కూలీలు అందరికీ గాయాలు కావడం జరిగింది. బాల బాదు అనే వ్యక్తికి తలకు త్రీవంగా గాయం కావడంతో పరిస్థితి విషమంగా ఉండటంతో  108 వాహనంలో కనిగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలానికి తాడి వారి పల్లి ఎస్ఐ ఆవుల వెంకటేశ్వర్లు, సిబ్బంది అక్కడకు చేరుకొని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.






 


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: