కనక దుర్గా ప్లైఓవర్ బ్రిడ్జ్ సర్వీసు రోడ్డు విస్తరణకు రంగం సిద్ధం 

షాపుల యజమానులకు నోటీసులు జారీ 

షాపు యజమానులకు నోటీసులు ఇష్తున్న అధికార్లు

(జానోజాగో వెబ్ న్యూస్-విజయవాడ ప్రతినిధి)

 భారతదేశం లోని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన అతిపెద్డ బ్రిడ్జ్ ల్లో మూడవదయిన  విజయవాడలోని కనకదుర్గా ప్లై ఓవర్ బ్రిడ్జ్ ఇరువైపులా సర్వీస్ రోడ్డు నిర్మాణపనులకు అధికారులు రంగం సిద్ధం చేశారు బుధవారం ఉదయం భవానిపురంలోని 14 మంది షాపు యజమానులకు ఈ మేరకు నోటీసులు జారీ చేశారు తొలుత బ్రిడ్జ్ కి దక్షిణం వైపున ఉన్న షాపులను ఖాళీ చెయ్యాలని సదరు యజమానులకు పశ్చిమ మండలం తహశీల్దార్ కార్యాలయం సిబ్బంది స్వయంగా నోటీసులు అందించారు ఈ నెల 4 తేదీన 124 సచివాలయం వద్ద సర్వీసు రోడ్డు విస్తరణకు సంబంధించి సబ్ కలెక్టర్ ఆధ్వర్యంలో సమావేశం జరుగుతుందని ఆ సమావేశానికి షాపులయజమానులు హాజరు కావాలని తహశీల్దార్ కార్యాలయం సిబ్బంది తెలిపారు.
ఐ ఓ సి  పెట్రోలు బంక్ పక్కనున్న ఫర్నీచర్ షాపునుండి హుండా షోరూమ్ వరకూ గల మొత్తం 14 షాపుల యజమానులకు నోటీసులు అందించారు జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ఉత్తర్వులు జారీ చేయగా పశ్చిమ మండలం తహశీల్దార్ కార్యాలయం ఎం ఆర్ ఓ మాధురి ఆదేశాలు మేరకు గ్రేడ్వన్ వి ఆర్ ఓ సిరివెన్నెల, గ్రేడ్ టూ వి ఆర్ ఓ లు శివాజీ, విజయ తదితరుల బృందం  ఈ నోటీసులు అందించారు ఐతే కొంతమంది షాపుల యజమానులు అందుబాటులో లేనందున షాపుల షెట్టర్లుకి నోటీసులు అంటించారు.
ఐతే ఎంతో విలువైన తమ షాపుల, ఇళ్ల స్థలాలు సర్వీసు రోడ్డు విస్తరణ పనుల వల్ల కోల్పోతున్న యజమానుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి  ప్రజా ప్రయోజనాల దృష్ట్యా విస్తరణ పనులు జరుగుతున్న దరిమిలా తమ ఆస్తులు ఎలా కాపాడుకోవాలో అర్థం కాక కొందరు రాజకీయ పార్టీల నాయకులను ఆశ్రయించదానికి పరుగులు తీస్తున్నారు బహిరంగ మార్కెట్లో గజం లక్షలాది రూపాయల విలువ చేసే తమ స్థలాలు ప్రభుత్వ అధికారులు స్వాధీనం చేసుకొనున్నారని తెలియడంతో పలువురికి కంటిమీద కునుకు లేకుండా రోజుల భారంగా గడుస్తున్నాయనడంలో అతిశయోక్తి లేదు

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: