మునిసిపల్ కమిషనర్ ను కలిసిన...
నెల్లూరు జర్నలిస్ట్ హౌసింగ్ ఆడహక్ కమిటీ
(జానోజాగో వెబ్ న్యూస్-నెల్లూరు ప్రతినిధి)
ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు ఆడహక్ కమిటీ కన్వీనర్/ అధ్యక్షులు వి.శేషా చలపతి , కో- కన్వీనర్/ ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్ కుమార్ లు బుధవారం మునిసిపల్ కమిషనర్ కె.దినేష్ కుమార్ కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ వి. శేషా చలపతి మాట్లాడుతూ కొత్తూరు లో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీ కు సంబంధించిన 20 ఎకరాల లే అవుట్ లోగల పబ్లిక్ ,ఓపెన్ స్పెసెస్ స్థలాలు ,రోడ్లను అప్పజెప్పి కార్పొరేషన్ లోని టౌన్ ప్లానింగ్ విభాగం వారిని తీసుకొని అభివృద్ధి చేయాలని కోరామన్నారు. జర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత ఫిజుల తోనే ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment:
0 comments: