పూజారులపై దాడిచేసిన వారిపై చర్యలు తీసుకోండి
జానోజాగో సంఘం నేత సయ్యద్ మహబూబ్ బాషా డిమాండ్
(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)
కర్నూలు జిల్లా బండి ఆత్మకూరు మండలం ఓంకార క్షేత్రంలో దారుణంగా వ్యవహరించి ఆలయ పూజారులను చితకబాదిన ఆలయ చైర్మన్ ప్రతాప్ రెడ్డిని తక్షణమే అరెస్టు చేయాలని జానోజాగో(ముస్లింల అభివృద్ది వేదిక) సంఘం జాతీయ కార్యదర్శి సయ్యద్ మహబూబ్ బాషా డిమాండ్ చేశారు. వెంటనే చైర్మన్ ను విధుల నుంచి తొలగించి సంఘటనకు బాధ్యులైన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. దేవాలయాల్లో స్వాములకు రక్షణ లేకపోతే వారు భక్తులకు సేవలు ఎలా చేయగలుగుతారు అని ఆయన ప్రశ్నించారు. పూజారులను చర్నకోలతో కొట్టడం ఏంటి..మనం ఆటవిక వ్యవస్థలో ఉన్నామా లేక ప్రజాస్వామ్య వ్వవస్థలో ఉన్నామా అర్థం కావడం లేదు అని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. పూజారి మురుగ పాని శర్మను తీవ్రంగా గాయపరచి,మరో ఇద్దరు పూజారులు చక్రపాణి శర్మ, సుధాకర్ ను గాయపరచిన చైర్మన్ ను వెంటనే అరెస్టు చేయాలని జానోజాగో(ముస్లింల అభివృద్ది వేదిక) సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
Post A Comment:
0 comments: