కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా  బి..శ్రీనివాసులు

శ్రీనివాసులుకు ఘన సన్మానం

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా  బి..శ్రీనివాసులు (ఉకోటు వాసు) నియమితులయ్యారు. ఈ మేరకు ధ్రువీకరణపత్రాన్ని పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  డాక్టర్ చింతల మోహన్ రావు అందజేశారు.  బి..శ్రీనివాసులు    రాష్ట్ర అధికార ప్రతినిధి పదవి వచ్చిన  సందర్భంగా నంద్యాల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నాయకులు కార్యకర్తల  శాలువా తో సన్మానించారు. ఈ సందర్భంగా  బి..శ్రీనివాసులు  మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో కష్టపడే వారికి ఏప్పటికి గుర్తింపు ఉంటుందని కష్టపడే వారికి మంచి పదవులు ఇచ్చి గౌరవిస్తుందని  అన్నారు తనపై నమ్మకంతో ఈ బాధ్యత అప్పజెప్పిన ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ఉమెన్ చాందీ, రాష్ట్ర అధ్యక్షులు శైలజానాథ్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలికి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  చింతల మోహన్ రావుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సేవాదళం రాష్ట్ర కార్యదర్శి మస్తాన్ ఖాన్ , పట్టణ అధ్యక్షులు దాసరి చింతలయ్యా, జిల్లా కార్యదర్శి  కరాటే బాలకృష్ణ, యూత్ కాంగ్రెస్ నాయకులు చాంద్ భాషా, ఆంజనేయులు, రవి, మహబూబ్ బాషా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: