ఈ నెల 8 న భారత్ బంద్

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సేవ దళ్ కార్యదర్శి   మస్తాన్ ఖాన్

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

ఈ నెల 8వ తేదీన జరిగే భారత్ బంద్ లో భాగంగా నంద్యాల పట్టణంలో కూడా బంద్  నిర్వహించడం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సేవ దళ్ కార్యదర్శి   మస్తాన్ ఖాన్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర బిజెపి ప్రభుత్వం తేచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా,ఆ చట్టాలను రద్దు చేయాలని ఢీల్లిలో వ్యవసాయ రైతులు చేస్తున్న రైతాంగ పోరాటానికీ మద్దతుగా ఈ బంద్  నిర్వహించడం జరుగుతున్నది.కనుక రైతులు, వ్యవసాయదారులు,వ్యాపార సంస్థలు,కూరగాయల మార్కెట్,విద్యాసంస్థలు, సామాన్య ప్రజలు అందరూ ఈ బంద్ లో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాము. అని ఆయన వెల్లడించారు. రేపు భారత్ బంద్ కు కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ఇస్తుంది నంద్యాల కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జ్ డాక్టర్ చింతల మోహన్ రావు పాల్గొంటారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: