సోనియా గాంధీ 74 వ జన్మదిన సందర్భంగా..

 రైతులకు ఘన సన్మానం

సన్మానం చేస్తున్న పిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ చింతల మోహన్ రావు

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

సోనియా గాంధీ 74 వ జన్మదిన సందర్భంగా రైతులకు సన్మానం చేయడం జరిగిందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ చింతల మోహన్ రావు పేర్కొన్నారు.  బుధవారం నంద్యాల  నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు త్యాగశీలి ఏఐసిసి అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ 74వ జన్మదినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డాక్టర్ చింతల మోహన్ రావు మాట్లాడుతూ ప్రస్తుతం దేశవ్యాప్తంగా రైతుల ఆందోళనలు జరుగుతున్న సందర్భంలో సోనియా గాంధీ గొప్ప మనసుతో పార్టీ శ్రేణులను జన్మదిన వేడుకలు జరపకూడదని సూచించడం జరిగిందని, అందువల్ల దేశానికి వెన్నెముక అయిన రైతులను కేంద్ర ప్రభుత్వం మభ్యపెట్టి వారి నడ్డివిరిచే విధంగా పార్లమెంట్లో చట్టాలను తీసుకొనివచ్చి ఇబ్బందులకు గురి చేస్తుందని ఆరోపించారు.
సోనియా గాంధీ జన్మదిన వేడుకలు జరుపుకోకుండా రైతులను సన్మానించడం జరిగిందన్నారు. ప్రధానమంత్రి పదవి అవకాశం వచ్చినా తిరస్కరించిన మృదుస్వభావి సోనియా గాంధీ అని,  డాక్టర్ మన్మోహన్ సింగ్ ను  ప్రధానమంత్రి చేసి ఆదర్శంగా నిలిచారన్నారు. త్యాగాల కుటుంబంలోనికి వచ్చి ఆమె కూడా త్యాగశీలి అయ్యారని, యు.పి.ఏ  చైర్మన్ గా అత్యంత సమర్థవంతంగా దేశాన్ని పరిపాలించడానికి తోడ్పడ్డారని చెప్పారు. రాష్ట్ర అధికార ప్రతినిధి ఉకొటువాసు మాట్లాడుతూ రాబోయే ఎన్నికలలో ఆమె నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆమె నాయకత్వంలో అందరం సమిష్టిగా పనిచేసి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తామన్నారు. సోనియా గాంధీ పుట్టిన రోజు వారు సూచించిన విధంగా జన్మదిన వేడుకలు జరుపుకున్న ఈ దేశానికే తలమానికమైన రైతులను సన్మానించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధికార ప్రతినిధి వాసు, సేవాదళం రాష్ట్ర కార్యదర్శి మస్తాన్ ఖాన్, సీనియర్ నాయకులు ఆర్ టి సి ప్రసాద్, పాస్టర్ పాల్ రాజ్, మైనార్టీ నాయకులు కటీక కాసీం,  బండి ఆత్మకూరు మండల అధ్యక్షుడు రవిబాబు, జిల్లెల్ల సత్తార్, యూత్ కాంగ్రెస్ నాయకులు చాంద్ బాషా, మహబూబ్ బాషా, ఆంజనేయులు, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: