అంబేద్కర్ బాటలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్

63 వ వర్ధంతి కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర నేత డాక్టర్ ఏలూరి.


 

( జానో జాగో  వెబ్ న్యూస్-- హైదరాబాద్ ప్రతినిధి)

భారత రాజ్యాంగ నిర్మాత, దేశ ప్రజల ఆశాజ్యోతి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయ సాధనే లక్ష్యంగా  పనిచేస్తూ అదే బాటలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పయనిస్తున్నారని రాష్ట్ర వైసీపీ నాయకులు డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 63 వ వర్ధంతి సందర్భంగా నేడు హైదరాబాద్ లోని కూకట్పల్లి లో అంబేడ్కర్ విగ్రహనికి డాక్టర్ ఏలూరి పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  అట్టడుగు వర్గాలు,నిమ్న జాతుల అభివృద్ధికి అలాగే దేశపురోభివృద్ధికి భారత రాజ్యాంగం దిక్చుచి లాగా పనిచేస్తుందని అన్నారు.అందులో భాగంగానే డాక్టర్ బీఆర్ ఆశయ సాధనకు అనుగుణంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్రంలో పరిపాలనా కొనసాగిస్తూ, అట్టడుగు వర్గాలైన దళితులకు, బలహీన,మైనారిటీ వర్గాలకు అధికార పదవులు కట్టబెట్టి పెద్దపీట వేస్తున్నారని అన్నారు. దింతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. దేశం యావత్తు నేడు జగన్ పాలనను మెచ్చుకుంటుందని గుర్తు చేశారు.

గతంలో రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి ఇవ్వని విధంగా రాష్ట్ర మంత్రి వర్గంలోకాని, నామినేటెడ్ పదవులు  ఎస్ సి,ఎస్ టి, బిసి,మైనారిటీ లకు కట్టబెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి కే దక్కిందని డాక్టర్ ఏలూరి అన్నారు. అట్టడుగు వర్గాల వారికి కేవలం పదవులు ఇవ్వాడమే గాక వారిలో ఆర్ధిక పరిపుష్టి పెంపొందించే విధంగా వివిధ రకాల వృత్తి నైపుణ్యానికి సంబంధించి పరికరాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అందించి వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని రాష్ట్ర వైసీపీ నాయకులు డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి అన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: