ఢిల్లీలో రైతు పోరాటాలకు మద్దతుగా...3న రాస్తారోకో
సిపిఎం వెల్లడి
(జానోజాగో వెబ్ న్యూస్-నందికొట్కూర్ ప్రతినిధి)
నందికొట్కూర్, కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన రైతు వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా పంజాబ్ హర్యానా రాజస్థాన్ రాష్ట్రాల రైతులు గత ఏడు రోజులుగా చేస్తున్న పోరాటాలకు మద్దతుగా ఈ నెల 3న నందికొట్కూరు పట్టణంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే రాస్తారోకో కు రైతులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఎం నాగేశ్వరరావు పిలుపునిచ్చారు, బుధవారం స్థానిక సిపిఎం కార్యాలయంలో ముఖ్యకార్యకర్తల సమావేశం సిపిఎం జిల్లా నాయకులు కె భాస్కర్ రెడ్డి అధ్యక్షతన జరిగింది, ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ ఢిల్లీలో రైతులు చలిలో కొనసాగిస్తున్న పోరాటానికి ఇద్దరు రైతులు బలి అయినప్పటికీ నరేంద్ర మోడీ ప్రభుత్వం చెల్లించకపోవడం శోచనీయమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు, భవిష్యత్తులో సుదీర్ఘ పోరాటాల నిర్వహించేందుకు సిద్ధమవుతున్నార అన్నారు, దేశ రైతాంగానికి వ్యవసాయానికి ముప్పు తెచ్చే నల్ల చట్టాలను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా నాయకులు రాజు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు టీ పకీర్ సాహెబ్ ఈశ్వరమ్మ శ్రీనివాసులు కెవిపిఎస్ జిల్లా నాయకులు ఎం కర్ణ నాయకులు మద్దిలేటి రజిత మద్దమ్మ హుస్సేన్ అమ్మ శేషన్న తదితరులు పాల్గొన్నారు
Post A Comment:
0 comments: