13న రజక కార్తీక వన భోజన కార్యక్రమము
- అఖిలభారత రజక సేవా సంఘం
అధ్యక్షులు జిల్లెల్ల శ్రీరాములు
(జానో జాగో న్యూస్ -కర్నూలు జిల్లా ప్రతినిధి)
అఖిలభారత రజక సేవా సంఘం వారిచే కార్తీకమాసం సందర్భంగా
నంద్యాలలో ప్రధమ నందీశ్వర స్వామి సన్నిధిలో వైఎస్ఆర్ కళ్యాణమండపం నందు 13వ తేదీన 8వ రజక కార్తీక వన భోజన కార్యక్రమము నిర్వహించడం జరుగుతుందని అఖిలభారత రజక సేవా సంఘం అధ్యక్షులు జిల్లెల్ల శ్రీరాములు తెలిపారు. ఈ సందర్బంగా రజక సేవా సంఘ నాయకులు కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం శ్రీరాములు మాట్లాడుతూ పదవ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఎంసెట్ పరీక్షలలో 85% పైన ప్రతిభ కనబరిచిన రజక విద్యార్థిని విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు సన్మానం చేసి ప్రోత్సాహకాలు అందించబడుతుందన్నారు. ఈ కార్యక్రమానికి రాజకీయాలకు అతీతంగా రజక ఎమ్మెల్సీలు, రజక కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు, కార్పొరేటర్లు, ఎంపీటీసీలు, జెడ్పిటిసిలు, రాష్ట్ర, దేశ వ్యాప్త రజక నాయకులు వివిధ రంగాలలో నిష్ణాతులైన కళాకారులు పాల్గొంటారన్నారు. పిల్లలకు ఆట పోటీలు, డాన్స్ కార్యక్రమాలు, మహిళలకు డిపు సిస్టం ద్వారా 5000 విలువగల పట్టు చీర లక్కీ డ్రా ద్వారా తీయబడును. ఈ కార్యక్రమానికి నంద్యాల, చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించిన రజక సోదరీ సోదరీమణులు కుటుంబ సమేతంగా హాజరై రజక కార్తీక వన భోజనాన్ని జయప్రదం చేయవలసిందిగా అధ్యక్షులు జిల్లెల్ల శ్రీరాములు, గౌరవ అధ్యక్షులు రామ మద్దిలేటి, మురళి, ఫైనాన్స్ మద్దిలేటి, రామచంద్రుడు, హరి, రోషన తదితరులు కోరారు.
Post A Comment:
0 comments: