విద్యార్థినులకు ప్రోత్సాహక బహుమతులు 

రావూస్ కళాశాల జూనియర్ ఇంటర్ ఫలితాల్లో మంచి మార్కులు

విద్యార్థినులను  అభినందిస్తున్న ప్రిన్సిపల్

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

రావూస్ కళాశాల నందు జూనియర్ ఇంటర్ అర్థ శాస్త్రము నందు 100 కి 95 మార్కుల పైన ఒక కళాశాల నందు ఎనిమిది మంది విద్యార్థులు సాధించడం అసాధ్యాన్ని సుసాధ్యం చేశారని కళాశాల చైర్మన్ అప్పారావు తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ దొడ్డ సుంకయ్య మాట్లాడుతూ 100 కి 98,98,97,96,96,96,95,95 ఇలాంటి మార్పులు అమ్మాయిలు రాష్ట్రంలో మరే ఇతర కళాశాలలో ఉండదని తెలిపారు. అంతే కాకుండా CEC విభాగము నందు 500 కి 466, 464, 463, 463  నలుగురు సాధించారని తెలిపారు. మొదటి సంవత్సరం అర్థశాస్త్రం నందు అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు రెండవ సంవత్సరం నందు కూడా అత్యుత్తమ మార్కులు సాధించాలని కళాశాల అర్థశాస్త్ర అధ్యాపకుడు శేషశయనారెడ్డి విద్యార్థులకు ఉచితంగా టెక్స్ట్ బుక్స్ ప్రోత్సాహంగా ఇవ్వడము జరిగినది. ఈ కార్యక్రమంలో సీనియర్ సంస్కృత అధ్యాపకుడు వసంతరావు పాల్గొన్నారు

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: