ఘనంగా రాజ్యాంగ దినోత్సవం
ప్రతి భారతీయుడికి సమన్యాయం కల్పించింది రాజ్యాంగం
(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)
ప్రతి భారతీయుడికి సమన్యాయం క్పలించింది మన భారత రాజ్యాంగం అని ముస్లిం ప్రజా సంఘాల నేతలు పేర్కొన్నారు. రాజ్యాంగం ప్రకారమే ప్రభుత్వాలు నడుచుకోవాల్సిన అవసరముందని వారు అభిప్రాయపడ్డారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఐయుఎంఎల్ పార్టీ కార్యాలయంలో మైనార్టీ సంఘాల నేతలు ఘనంగా రాజ్యాంగ దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సేవ దళ్ కార్యదర్శి మస్తాన్ ఖాన్ సాహెబ్, జానో జాగో(ముస్లిం అభివృద్ధి వేదిక) సంఘం జాతీయ కార్యదర్శి సయ్యద్ మహబూబ్ బాషా,
ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ కర్నూలు జిల్లా వైస్ ప్రెసిడెంట్ హజరత్ మౌలానా రఫీ ఉద్దీన్ సహాబ్, జిల్లా ప్రధాన కార్యదర్శి సలాం మౌలానా, సెక్రెటరీ ఎస్ ఎం ది ఉమర్ పాల్గొన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా వారు స్వీట్లు పంచుకుని రాజ్యాంగ దినోత్సవ సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ 1949లో భారత రాజ్యాంగ కమిటీ రాజ్యాంగ ముసాయిదాను చేపట్టగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆధ్వర్యంలో రాజ్యాంగ కమిటీ 1949 నవంబరు 26వ తారీఖున ఈ ముసాయిదా పై సంతకం చేశారని, ఈ సందర్భంగా 71వ జాతీయ న్యాయ దినోత్సవం జరుపుకుంటున్నామని , మనమందరం రాజ్యాంగ పరిరక్షణకు కృషి చేయాలని, రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులతో పాటు బాధ్యతలు కూడా ముఖ్యమని తెలియజేశారు.
Post A Comment:
0 comments: