దేశానికి మార్గనిర్దేశం చేసిన మహనీయుడు పూలే

ఆర్వీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు రాజునాయుడు రామినేని

పూలేకు నివాళులర్పిస్తున్న ఆర్వీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు రాజునాయుడు రామినేని

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

నిమ్న జాతీయులు స్వతంత్ర భారతంలో తలెత్తుకుని రాజకీయ, ఉద్యోగ, విద్యారంగాల్లో రాణిస్తున్నారంటే దానికి ముఖ్యకారకుడు మహాత్మా జ్యోతి రావు పూలే అని ఆర్వీఎఫ్,  ఆర్.వై.యు రాష్ట్ర అధ్యక్షులు రామినేని రాజునాయుడు అన్నారు. దేశానికి మార్గ దర్శనం చేసిన మహనీయులు జ్యోతిరావు పూలే అని ఆయన పేర్కొన్నారు. నేటి యువత ఆయన్ని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని కోరారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహోన్నత వ్యక్తిగా కొనియాడారు. మహాత్మా జ్యోతి రావు పూలే 130వ వర్ధంతి సందర్భంగా నంద్యాలలోని జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాలులర్పించారు.
ఈ సందర్భంగా ఆర్వీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు రామినేని రాజునాయుడు,  ఆర్ఎస్ఏ జిల్లా అధ్యక్షులు  వెంకట్   లు మాట్లాడుతూ* కుల వివక్షకు వ్యతిరేకంగా పూలే జీవితాంతం పోరాటం చేశారన్నారు. పూలే కలలు కన్న రాజ్యం రావాలంటే ప్రజలంతా చైతన్యవంతులై ఉండాలని పిలుపునిచ్చారు. సమాజంలో మార్పు కోసం పూలే చేసిన త్యాగాలను మననం చేసుకుంటూ వారి బాటలో నడవాలని సూచించారు. పూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: