అణగారిని వారికి విద్యను అందించిన మహానీయుడు పూలే

టిడిపి రాష్ట్ర కార్యదర్శి జిల్లెల్ల శ్రీరాములు

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

అణగారిని వారికి విద్యను అందించిన మహానీయుడు మహాత్మ జ్యోతిరావు పూలే అని టిడిపి రాష్ట్ర కార్యదర్శి జిల్లెల్ల శ్రీరాములు పేర్కొన్నారు. మహాత్మ జ్యోతిరావు పూలే 130 వర్ధంతి సందర్భంగా ఆయనకు జిల్లెల్ల శ్రీరాములు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  జ్యోతిరావు పూలే పాఠశాలలు ఏర్పాటు చేసి బిసి ఎస్సీ ఎస్టీ మైనార్టీ అగ్రవర్ణాల వారికి చదువు నేర్పించి ఉన్నారని,  భార్య సావిత్రిబాయిపూలేకు  చదువు నేర్పించినారని,  అగ్రవర్ణాలవారు, బడుగులు చదువుకోకూడదని హుకుం జారీచేసి మహాత్మా పూలేని ఆయన భార్యను కొట్టినారని, అయినా కూడా అందరికీ సమాన విద్య నేర్పించారని, వితంతువులకు సమాన విద్య నేర్పించి, వారికి పెళ్లిళ్లు చేశారన్నారు. ఈనాడు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి నియోజకవర్గంలో మహాత్మ పూలే విగ్రహాలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి జిల్లెల్ల శ్రీరాములు పాల్గొని పూలమాలవేసి నివాళులు అర్పించారు, BC  సంఘం నాయకులు రమణయ్య గౌడ్, వేణుగోపాల్ నాయుడు, పీఎం ఆర్ విద్యా సంస్థల అధినేత పబ్బు బాలచంద్రుడు, వడ్డే సుబ్బరాయుడు, ఎక్స్ కౌన్సిలర్ చింత శీను, రోషనా తదితరులు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: