రోడ్డు ప్రమాదంలో  ఇద్దరు యువకులు మృతి

మరొకరికి పరిస్థితి విషమం

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

శిరువెళ్ళ మండల పరిధిలోని బొయలకుంట్ల గ్రామ విద్యుత్ సబ్ స్టేషన్ సమీపంలో గల  రహదారి పై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడి కక్కడే  మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఎస్సై సూర్య మౌళి తెలిపారు. నంద్యాల చాంద్ బడా కు చెందిన ముగ్గురు యువకులు శిరివెళ్ల మండలం బోయలకుంట్ల గ్రామంలో జరిగిన ఒక వివాహ కార్యక్రమానికి బైక్ పై వెళ్లి స్వగ్రామమైన నంద్యాలకు వస్తుండగా బొలెరో వాహనం డి కొనడంతో జుబేర్ (23), సమీర్ (24) ఘటనా స్థలంలో మృతి చెందినట్లు తెలిపారు.
రంగనాయకులు (22) కు తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన చికిత్స నిమిత్తం కర్నూలు జిల్లా ప్రభుత్వ వైద్య శాలకు తరలించినట్లు ఎస్సై తెలిపారు. మృత దేహాలను పంచనామా నిమిత్తం మార్చురీకి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నట్లూ తెలిపారు. నంద్యాల ప్రభుత్వ. ఆసుపత్రికి మృతుల బంధువులు తరలి రావడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.


 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: