మిని ట్రక్కు పథకంకు దరఖాస్తు చేసుకోండి

మార్కాపురం మున్సిపల్ కమీషనర్ నయీమ్ అహ్మద్

(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఇబీసీ లబ్దిదారులకు ఆదాయస్ధితిని పెంచుటకు, నికర, నిరంతర స్వయం ఉపాధి కల్పనలో భాగంగా ఫోర్ వీలర్ మిని ట్రక్కు ( సరుకు బట్వాడా యూనిట్) లను 60% సబ్సిడీతో అందించే పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలని మార్కాపురం పట్టణ మునిసిపల్ కమీషనరు నయీమ్ అహమ్మద్ వెల్లడించారు. ఈ మేరకు సోమవారంనాడు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ పథకం కింద లబ్ధిపొందేందుకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన సూచించారు. ఈ పథకం పొందేందుకు వీరు అర్హులు అని అర్హతా నిబంధనలను కమీషనరు నయీమ్ అహమ్మద్ వెల్లడించారు.


 

పథకం పొందేందుకు ఉండాల్సిన అర్హతలు ఇవే:

 1. దరఖాస్తుదారుని కుటుంబ ఆదాయం నెలకు రూ. 12,000/-లు మించరాదు.

 2. కుటుంబములో ప్రభుత్వ ఉద్యోగి/పెన్షనర్ వుండకూడదు.

 3. కుటుంబములో నాలుగు చక్రాల వాహనము కలిగియుండకూడదు.

 4. కుటుంబములోని సభ్యులు ఎవరూ ఆదాయపన్ను చెల్లింపుదారులై వుండరాదు.

 5. అభ్యర్ధి స్ధానికుడై ఉండవలయును.

 6. అభ్యర్ధి వయస్సు 21 నుండి 45 సంవత్సరములు కలిగి యుండవలయును. 

 7. కనీస విద్యార్హత 7వ తరగతి పాసై ఉండవలయును.

 8. అభ్యర్ధి LMV ( లైట్ మోటార్ వెహికల్) లైసెన్సు కలిగి యుండాలి.

 9. అభ్యర్ధి గతంలో రుణం తీసుకొని/బ్యాంకు కు డిఫాల్టర్ అయి ఉండరాదు.

 10. స్ధానిక ధ్రువీకరణ పత్రములు ( ఆధార్/రైస్ కార్డు/తహసిల్దారు వారిచే మంజూరు చేయబడిన సర్టిఫికేట్)

 11. కుల ధ్రువీకరణ పత్రం ( ఇంటి గ్రేటేడ్ సర్టిఫికేట్) కలిగి వుండాలి. 

      కావున ఆసక్తి గలవారు మీ మీ వార్డు సచివాలయముల నందు సదరు దరఖాస్తులతో తేది 27-11-2020. సాయంత్రం 5 గంటలలోపు వార్డు వెల్ఫేర్ సెక్రటరి వారికి అన్ని ధ్రువీకరణ పత్రములను జతపరచి అందచేయవలసిందిగా మార్కాపురం పట్టణ మునిసిపల్ కమీషనరు నయీమ్ అహమ్మద్ గారు తెలియచేశారు.

షేక్ గౌస్ బాషా

ప్రకాశం, గుంటూరు జిల్లాల బ్యూరో చీఫ్

జానోజాగో వెబ్ న్యూస్ 


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: