దోషులను శిక్షించడంలో సీఎం విఫలం
సీబీఐ విచారణ చేయడంపై జంకు ఎందుకు
అబ్దుల్ సలాం న్యాయ పోరాట కమిటీ
(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)
అబ్దుల్ సలాం న్యాయ పోరాట కమిటీ ఆధ్వర్యంలో సలాం కుటుంబానికి సంపూర్ణ న్యాయం కోసం నాలుగు డిమాండ్లతో సాగుతున్న రిలే నిరాహార దీక్ష 5 వ రోజు పూర్తి చేసుకొంది. ఈ ఐదవ రోజు దీక్షను సిపిఐ సీనియర్ నాయకులు సలాం ఖాన్ ప్రారంభించారు. ఆవాజ్ యూత్ నాయకుడు సద్దాం హుస్సేన్ అధ్యక్షత జరిగిన ఈ దీక్షలో అబ్దుల్ సలాం న్యాయ పోరాట కమిటి సభ్యులు ఎం.హెచ్ పిఎస్ జిల్లా అధ్యక్షుడు యూనిస్ ,సీపీఐ పట్టణ సహాయ కార్యదర్శి ఎస్. షరీఫ్, ఐఎఫ్ టీయూ అధ్యక్షులు ఇర్ఫాన్ బాషా, ఐయూఎంఎల్ నాయకులు సాజిత్, ఎంహెచ్ పీఎస్ నాయకులు నూర్, వసీం, నియమత్ ఖాన్, హనీఫ్, మహమ్మద్ అలీ, మెహబూబ్ దీక్షకు కూర్చున్నారు.
ఈ దీక్షా శిబిరాని ఉదేశించి ఆవాజ్ కమిటీ జిల్లా కన్వీనర్ ఎస్.మస్తాన్ వలి, పీడీఎస్ యూ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్.ఎం.డీ.రఫీ, ఎంహెచ్ పిఎస్ జిల్లా అధ్యక్షుడు యూనిస్, సీపీఐ పార్టీ పట్టణ సహాయ కార్యదర్శి ఎస్. షరీఫ్ మాట్లాడుతూ సీబీఐ విచారణ జరిపించ లేని ముఖ్యమంత్రి బంధువులకు 25 లక్షలు ఇచ్చిన వారు రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఏడు లక్షల రూపాయలు ఇస్తానని నంద్యాల ప్రాంతంలో చాలామంది రైతులకు ఇవ్వలేదని కోవిడ్ సమయములో ఉపాధి కోల్పోయిన ఉపాధ్యాయులు లెక్చరర్లు మరియు సిబ్బందికి కనీసం నెలకు పదివేల రూపాయలు అలాగే ఇసుక లేక ఇబ్బంది పడుతున్న గౌండ కార్మికులకు ఒక పైసా కూడా ఇవ్వలేని సీఎం రాష్ట్ర ప్రభుత్వం వచ్చి అధికారంలో 20 నెలలు కావస్తున్నా ఏ కులం వారికి కూడా పెళ్లి కానుక అందించడంలో పూర్తిగా వైఫల్యం చెందారు. సలాం అత్తకు డబ్బులు ఇచ్చి ముస్లింలకు మోసం చేస్తే మోసపోయేవారు లేరని మీకు ముస్లిం పట్ల నిజాయితీ ఉంటే తక్షణమే అబ్దుల్ సలాం ఆత్మహత్య కు కార్కులైన దోషులను శిక్షించాలని,
సిబిఐ విచారణ జరిపించాలని లేకపోతే మీరు ముస్లింల ద్రోహులు అవుతారని పై నాయకులు విమర్శించారు. ఈ 5 వ రోజు దీక్షకు ఆవాజ్ కమిటీ జిల్లా కన్వీనర్ మస్తాన్ వలి, జానోజాగో (ముస్లింల అభివృద్ది వేదిక) సంఘం జాతీయ కార్యదర్శి సయ్యద్ మహబూబ్ బాషా, పిడిఎస్ యూ జిల్లా సహాయ కార్యదర్శి రఫీ ,ప్రగతిశీల యువజన సంఘం జిల్లా నాయకులు నవీన్, ఎంఆర్ఎఫ్ నంద్యాల డివిజన్ అధ్యక్షులు మహబూబ్ బాషా, సుహైల్ రానా ప్రజా ఐక్యవేదిక అక్బరుద్దీన్, గడివేముల ఆవాజ్ నాయకులు ఫారుక్ తమ సంపూర్ణ మద్దతు తెలియజేశారు.
Post A Comment:
0 comments: