గురు నానక్ జయంతిసంధర్బంగా...
వేలాది మందికి అన్నదానం
(జానోజాగో వెబ్ న్యూస్-హిందూపురం ప్రతినిధి)
అనంతపురం జిల్లా హిందూపురం సేవామందిర్ లింగన్న పాఠశాల దగ్గర ఈ రోజు సిక్కు సోదరులు సత్ సంగతె ఆధ్వర్యంలో మోహిందర్ జీత్ సింగ్.పల్వీందర్ సింగ్ సంయుక్త అధ్యక్షతన గురునానక్ జయంతి ని సిక్కు సోదరులు నిర్వహించారు. కుల మత వర్గ వర్ణాలకు అతీతంగా సిక్కు సోదరులు అన్ని మతాల సామాజిక వర్గాల నాయకులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు.
వారి సాంప్రదాయ పండుగను అన్ని మతాల సామాజిక వర్గాల సోదరులు సహకరించి విజయవంతం చేశారు. సోదరభావాన్ని ఆచరణాత్మక రూపంలో అమలు చేస్తూ దాదాపు వేలాది మంది ప్రజలకు అన్నదానం చేశారు సేవామందిరం ప్రశాంతి మందిరo వృద్ధాశ్రమంలో కూడా అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్లుశ్రీ రాములు .ధరణీ కిషోర్ ఒకటవ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ బాల మద్దిలేటి విశిష్ట అతిథులుగా ముస్లిం నగారా&టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షులు ఉమర్ ఫారూఖ్ ఖాన్. దండోరా నాయకులు సతీష్ కుమార్. దళిత హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు హనుమంతు బహుజన సమాజ్ పార్టీ నాయకులు శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment:
0 comments: