సలాం కుటుంబానికి న్యాయం జరగాలి

ప్రభుత్వ డ్రామాలు, మాయ మాటలు వినం...ధర్నాకు సిద్దం 

అయిదు డిమాండ్లు నెరవేర్చండి

అబ్దుల్ సలామ్ నాయపోరాట కమిటీ నాయకులు

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

అబ్దుల్ సలామ్ కుటుంభం ఆత్మహత్యకు న్యాయం జరగాలని, ప్రభుత్వ డ్రామాలు, మాయమాటలు నమ్మమని, అయిదు డిమాండ్లు నెరవేర్చాలని అబ్దుల్ సలామ్ నాయపోరాట కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. నంద్యాల పట్టణంలోని స్థానిక ఇక్రా పాఠశాలలో అబ్దుల్ సలామ్ న్యాయపోరాట కమిటీ నాయకులు,  ఒలమాలు, ఇమాములు, పార్టీలు, ప్రజా సంఘాలు కలిసి ఒక ప్రణాళిక రూపొందించామని పాత్రికేయ సమావేశంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అబ్దుల్ సలాం కుటుంబానికి న్యాయం జరగడంకోసం దీక్షలు చేపట్టిన విషయం అందరికి తెలుసన్నారు. దీక్షా శిబిరం వద్దకు డిఎస్పీ చిదానందరెడ్డి, సిఐలు వచ్చి కొన్ని హామీలు ఇస్తూ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొని వెళ్లి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో దీక్ష విరమించామని అన్నారు.


 

న్యాయం జరగలేదు,అబ్దుల్ సలామ్ కుటుంభం ఆత్మహత్య జరిగి 14 రోజులు గడిచాయని, ప్రభుత్వ డ్రామాలు, మాయమాటలు చెప్పి జాప్యం చేస్తూంబారని ఆరోపించారు. నేటి నుంచి ఐదు డిమాండ్లతో దీక్షల్లో కూర్చుంటున్నామని పేర్కొన్నారు. ప్రధానంగా సీబీఐ ఎంక్వైరీ, ఏడాదినుంచి కాల్ డేటా బయటపెట్టాలి, ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ద్వారా శిక్ష పడాలి, ఉద్యోగాల నుంచి తొలగించాలి, నిమిషంబా జ్యూవెలర్స్ యజమాని, గంగిశెట్టి శ్రీధర్ లను అరెస్ట్ చేయాలని, ఈ డిమాండ్లు నెరవేర్చేంతవరకు దీక్షలు ఆగవన్నారు. కులమతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా దీక్షలకు మద్దతు ఇవ్వాలని కోరారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: