సీపీఐ నేతల అరెస్ట్

చలో టిడ్కో కార్యక్రమంను అడ్డుకొన్న పోలీసులు

నాయకులను అరెస్ట్ చేసిన పోలీసులు 

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

చలో టిడ్కో కార్యక్రమంలో భాగంగా  సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామాంజనేయులు, జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ఎన్ రసూల్ తో పాటు సిపిఐ నాయకులను హౌస్ అరెస్ట్ చేశారు. సోమవారం చలో టిడ్కో గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన నాయకులతో పాటు స్థానిక నాయకులు బాబాఫకృద్దీన్, ప్రసాద్, సుబ్బరాయుడు తదితరులను పోలీసులు తెల్లవారుజామున హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్బంగా స్థానిక శోభ హోటల్ లో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామాంజనేయులు, జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ఎన్ రసూల్ లు మాట్లాడుతూ సీపీఐ చలో టిడ్కో గృహాల ప్రవేశ కార్యక్రమానికి పిలుపునిచ్చిన సీపీఐ నాయకులను రాష్ట్ర వ్యాప్తంగా అరెస్ట్ చేయడం దారుణమని, అర్హులయిన లబ్ధిదారులతో సమావేశం నిర్వహించి టిడ్కో గృహాలను ఇవ్వాలని, కానీ నిరంతరం ప్రజలకోసం పాటు పడుతున్న సీపీఐ నాయకులను గృహ నిర్బంధాలు, అక్రమ అరెస్టులు చేయడం దారుణమని,


 

రాష్ట్ర ప్రభుత్వం పెట్టదు అడుక్కొని తిననివ్వదు అన్న చందంగా జగన్మోహన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వైఖరి ఉందని, డిపాజిట్ కట్టిన లబ్ధిదారులకు టిడ్కో గృహాలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. అలాగే అర్ధరాత్రి నుండి పోలీసులు అరెస్టులు చేయడానికి ప్రయత్నాలు చేసినా ఎవరికి చిక్కకుండా చలో టిడ్కో గృహప్రవేశ కార్యక్రమంలో సీపీఐ, ఎఐఎస్ఎఫ్ నాయకులు పాల్గొన్నారు. నంద్యాల పట్టణంలోని ఎస్ఆర్బిసి వద్ద ఉన్న టిడ్కో గృహాల వద్ద సీపీఐ, ఎఐఎస్ఎఫ్ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేసి ట్రాక్టర్లో నంద్యాల 3వ పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ కార్యక్రమంలో ఎఐఎస్ఎఫ్ కర్నూల్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ధనుంజయుడు, శ్రీరాములు గౌడ్, సీపీఐ నంద్యాల పట్టణ సహాయ కార్యదర్శి షరీఫ్ బాషా, రైతు సంఘం డివిజన్ కార్యదర్శి సోమన్న తదితరులు పాల్గొన్నారు. 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: