ఆల్ మదద్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో....

హజ్ యాత్రికులకు ఉచిత సేవ, సలహా కేంద్రం 

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

ఆల్ మదద్ ఫౌండేషన్ చైర్మన్ ఆకుమల్ల రహీం ఆధ్వర్యంలో హజ్   యాత్రికులకు ఉచిత సేవ, సలహా కేంద్రాన్ని ఆదివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హజరత్ హాఫీస్ సయ్యద్ ఇసాక్, మౌలానా ఖలీల్ అహ్మద్,  ముస్లిం లీగ్ పార్టీ అధ్యక్షులు మౌలానా అబ్దుల్ సలాం,  మౌలానా రఫీ ఉద్దీన్, మౌలానా ఇద్రిస్ గారు, మాజీ కౌన్సిలర్ జాకీర్ హుస్సేన్ హాజరై హజ్ యాత్రికుల ఉచిత సేవ బ్యానర్ ను  విడుదల చేయడం జరిగింది. ఈ సందర్బంగా ఆల్ మదద్ ఫౌండేషన్ చైర్మన్  చైర్మన్ ఆకుమల్ల రహీం మాట్లాడుతూ తమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడపబడుతున్న ఆల్ మదత్  కంప్యూటర్ సెంటర్ నందు హజ్ యాత్రికుల ఉచిత సేవ సలహా కేంద్రాన్ని ప్రారంభిస్తున్నామని, ఈ సేవా కార్యక్రమంలో నంద్యాల డివిజన్ లోని ప్రతి ముస్లింలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరడం జరిగింది. మా ఆఫీసు సౌజన్య కాంప్లెక్స్ వెనుక వైపు, రాహుల్ ప్రింటర్స్ పైన కలదని, ప్రతిరోజు ఉదయం 10 గంటలనుండి  సాయంకాలం 6 గంటల వరకు మా సేవలు అందిస్తామని తెలిపారు.

 

మౌలానా  ఖలీల్ అహ్మద్ మాట్లాడుతూ 2021 సంవత్సరం మక్కాకు వెల్ల దలచిన ప్రతి ముస్లిం ఉచిత సేవా కార్యక్రమాన్ని ఉపయోగించుకొని లబ్ధి పొందాలని కోరడం జరిగింది. దరఖాస్తు చేసుకొనుటకు చివరి తేదీ డిసెంబర్ 10 వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని కోరడం జరిగింది. మాజీ కౌన్సిలర్ జాకీర్ హుస్సేన్ మాట్లాడుతూ ఈ సంవత్సరం హజ్ కు వెళ్లే  వారికి మూడు లక్షల లోపు వార్షిక ఆదాయం కలిగిన వ్యక్తులకు రాష్ట్ర ప్రభుత్వం 60 వేల రూపాయల సబ్సిడీ మంజూరు చేస్తుందని, మూడు లక్షలు పైబడి వార్షికాదాయం కలిగిన వారికి 30 వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ మంజూరు చేస్తుందని, మక్కా యాత్రకు వెళ్లే వ్యక్తికి కచ్చితంగా 18 సంవత్సరాలు పూర్తిగా నిండి ఉండాలని పాస్ పోర్ట్ కలిగి ఉండాలని  తెలియజేయడం జరిగింది. ఏకెహెచ్  ట్రస్ట్ చైర్మన్ మౌలానా ఇద్రిస్ మాట్లాడుతూ హాజ్ యాత్రికులకు సేవలు అందించడానికి ముందుకు వచ్చిన ఆల్ మదత్ పౌండేషన్ వారికి ప్రత్యేక అభినందనలు తెలుపుతూ ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు భవిష్యత్తులో చేసే విధంగా భగవంతుడు వీరికి సహాయ సహకారాలు అందించాలని కోరడం జరిగింది. ఐయూఎంఎల్ పార్టీ నాయకులు మౌలానా అబ్దుల్ సలాం మాట్లాడుతూ ప్రతి ముస్లిం ధనవంతులు కచ్చితంగా జీవితంలో కనీసం ఒక్కసారైనా మక్కా యాత్ర చేయాలని, అల్లా యొక్క ఆజ్ఞ అని తెలిపారు. 


 

ఈ కార్యక్రమం నందు ఆల్ మదద్ పౌండేషన్ ఛైర్మన్ ఆకుమల్ల రహీం, హాఫీస్  సయ్యద్ ఇసాక్ జమైతే ఉలేమా హింద్ అధ్యక్షులు మౌలానా ఖలీల్ అహ్మద్, ఏకెహెచ్ ట్రస్ట్ చైర్మన్ మౌలానా ఇద్రిస్, ఐయూఎంఎల్ పార్టీ జిల్లా నాయకులు మౌలానా అబ్దుల్ సలాం, మౌలానా రఫీ ఉద్దీన్, మాజీ కౌన్సిలర్ జాకీర్ హుస్సేన్, రెడ్ క్రాస్ డివిజన్ వైస్ ప్రెసిడెంట్ ఎస్ఎ గని, రుద్రవరం మండల తబ్లీగ్ అమీర్ సాబ్ మహబూబ్ బాషా ఆల్ మదద్ ఫౌండేషన్ సభ్యులు పఠాన్ జాకీర్ అలీఖాన్, రహంతుల్లా, అబ్దుల్లా, మహమ్మద్ సాద్, జలాలుద్దీన్, ఆల్ మదద్ కంప్యూటర్ సెంటర్  ఫ్యాకల్టీ  హిదయతుల్లా, అబ్దుల్ మజీద్ తదితరులు పాల్గొనడం జరిగింది.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: