ఆ భూములు వైద్యకళాశాల కేటయింపునకు వ్యతిరేకంగా
హైకోర్టులో బొజ్జా దశరథ రామి రెడ్డి పిల్
ఆ భూములను కాపాడుకొంటాం
రాయలసీమ సాగునీటి సాధన సమితి స్పష్టీకరణ
(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)
నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం భూములను నంద్యాలలో నిర్మాణం చేపట్టదలచిన వైద్య కళాశాలకు బదలాయింపుకు వ్యతిరేకంగా ప్రజా ప్రయోజనాల వ్యాజ్యంను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లో బొజ్జా దశరథ రామి రెడ్డి తదితరులు వేసారు. ఈ ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం పై ఫిర్యాదుదారుల తరుపున బొజ్జా అర్జున్ రెడ్డి, 6వ ప్రతివాది అయిన ఎడిఆర్, ఆర్ఏఆర్ఎస్ మినహా మిగిలిన ప్రతివాదుల తరుపున అడిషనల్ అడ్వకేట్ జనరల్ పి. సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. ప్రతివాది తరుపున వాదనలు వినిపించిన అడిషనల్ అడ్వకేట్ జనరల్ ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటుకు వ్యతిరేకంగా ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం వేయడానికి ఆశ్చర్యం వ్యక్తపరిచారు. గౌరవ హైకోర్టు కూడా దీనికి స్పందిస్తూ ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటును స్వాగతించాల్సిందిపోయి ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నించారు. పిర్యాదుదారుల తరుపున వాదనలు వినిపిస్తున్న బొజ్జా అర్జున్ రెడ్డి స్పందిస్తూ ప్రతి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు చేయాలన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయాన్ని పిర్యాదుదారలు నిండు మనసుతో స్వాగతిస్తున్నారని చెప్పారు. అయితే వ్యవసాయ పరిశోధనా స్థానంను అందులోను ప్రధానంగా 1906 వ సంవత్సరంలో ఏర్పాటు చేసిన చారిత్రక పరిశోధనా స్థానంను నిర్వీర్యం చేయడాన్ని వ్యతిరేకిస్తున్నామని వాదనలు వినిపించారు. ఈ పరిశోధన స్థానం వలన కర్నూలు ప్రాంతాలలో విత్తన పరిశ్రమ అభివృద్ధి చెంది ఈ ప్రాంతం ఆర్థికంగా అభివృద్ధి చెందిన విషయాన్ని కోర్టు దృష్టికి తెచ్చారు. రాష్ట్ర విభజన తరువాత తెలంగాణా ప్రభుత్వం కోట్లాది రూపాయల పెట్టుబడులు పెట్టి విత్తన కేంద్రంగా అభివృద్ధికి కృషి చేస్తుంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందుకు విరుద్ధంగా విత్తన కేంద్రంగా అభివృద్ధికి, రైతు సంక్షేమానికి కీలకమైన పరిశోధన స్థానం నిర్వీర్యం చేసే కార్యక్రమాలు చేపట్టిందని కోర్టుకు వివరించారు. అడిషనల్ అడ్వకేట్ జనరల్ పిర్యాదుదారుల తరుపు లాయర్ కు అడ్డు తగులుతూ, కాలీగా ఉన్న ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం భూములను ప్రభుత్వ వైద్య కళాశాలకు నిర్మాణానికి సేకరించడం అనే ప్రభుత్వ విధానాన్ని ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం ద్వారా అడ్డుకోరాదని వాదించారు. పిర్యాదుదారుల తర్పు న్యాయవాది అర్జున్ రెడ్డి తన వాదనలు వినిపిస్తూ ప్రభుత్వం సేకరించదలచిన భూములు కాలీ భూములు కావని, వీటిలో వివిధ పంటలపై వ్యవసాయ పరిశోధనలతో పాటు నోటిపైడ్ చేసిన విత్తనాలను ప్రభుత్వ పరిశోధనా స్థానాలు మాత్రమే ఉత్పత్తి చేసె న్యూక్లియస్ విత్తన ఉత్పత్తి కూడా ఈ భూముల్లో జరుగుతుందని కోర్టు దృష్టికి తెచ్చారు. పిర్యాదుదారుల తరుపు న్యాయవాది తన వాదనలు కొనసాగిస్తూ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం భూముల బదిలి కూడా ప్రభుత్వ భూ విధానానికి మరియు రెవెన్యూ బోర్డు నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్న విషయాన్ని కోర్టు దృష్టికి తెచ్చారు. నిరపయోగంగా చాలా ప్రభుత్వ భూములు ఉన్నాయని, వాటిని వైద్య కళాశాల ఏర్పాటుకు బదిలి చేసుకోవచ్చని విషయాన్ని కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఏ భూములు బదిలి చేయాలో ఎలా సలహా ఇస్తున్నారు, నిర్మాణాలు ఏమి లేని భూమిని కాలి భూమి అని ఎందుకు భావించరాదు, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం భూములలో ఎలాంటి నిర్మాణాలు లేవు దీనిని కాలీ భూములుగా ఎందుకు భావించరాదు అని పిర్యాదుదారుల తరుపు న్యాయవాదిని ప్రశ్నించారు. పిర్యాదుదారుల తరుపు న్యాయవాది స్పందిస్తూ ఎడిఆర్, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం తహసిల్దారుకు ఇచ్చిన ఉత్తరంలో నిర్మాణాలు లేని భూమిని కాలిగా భావించరాదని, అందులో వ్యవసాయ పరిశోధనలకు పంటలు వేస్తున్న విషయాన్ని తెలియజేసాడని తన వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా న్యాయవాదులు ఎదెరెదు వాదనలు చేసుకో వద్దని కోర్టు సూచించింది. అడిషనల్ అడ్వకేట్ జనరల్ ప్రభుత్వ ఆదేశాల కొరకు రెండు వారాల సమయం కోరారు. కోర్టు అందుకు అనుమతించింది. ఈ కేసు రెండు వారాలకు వాయిదా వేయడంతో పాటు పిర్యాదుదారుల తరుపు న్యాయవాదిని ప్రతివాది 6 అయిన ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఎడిఆర్ కు నోటీసు పంపమని ఆదేశించింది.
Post A Comment:
0 comments: