ఆ జ్ఞాపకాలతో ఓ మసీదు తెరుచుకొంది

మరోసారి భారతీయుల మతసామరస్యం చాట్టేలా చేసింది

ఆ మసీదుకు మరమ్మత్తులు చేసి తెరిచిన సిక్కు సోదరులు

ముస్లింలు, మత పెద్దలు తరలిరాగా ఓ ఉత్సవంలో ఆ కార్యక్రమం

మన దేశంలోని పురాతన అతి పురాతన మసీదు అది. పంజాబ్  కపుర్తాలాలోని మూయబడిన 550 సంవత్సరాల పురాతన మసీదు సిక్కులచే మరమ్మతు చేయబడి  ముస్లింలకు అప్పగించబడినది. మన దేశం భిన్నత్వంలో ఏకత్వం అన్న పేరు ఎందుకొచ్చింది....? అంటే దానికి బలమైన ఆధారాలు, అలాంటి సాంప్రదాయాలకు మన దేశం పుట్టినిల్లు. అలాంటి ఘటనలు మన దేశంలో అనేక. ఇపుడు ఓ సందర్భంగా అలా ఘటననే వెలుగులోకి తెచ్చింది. మరోసారి భారతదేశ పరమత సహనం ఘటనను వెలుగులోకి తెచ్చింది. పంజాబ్ కపుర్తాలలో  1947 నుండి మూయబడిన 550 సంవత్సరాల పురాతన మసీదును తిరిగి తెరవడంపై సిక్కులు, ముస్లింలు ఒక ఉత్సవం నిర్వహిస్తున్నారు. "ఈ మసీదు స్థానిక కోట లోపల ఉంది. 1947 లో దేశ విభజన సమయం  నుండి ఆ మసీదు మూసివేయబడింది. కానీ ఆ మసీదు ఇపుడు తెరుచుకుంది. ఇందుకు కొన్ని ఆసక్తికర కారణాలు ఉన్నాయి. ఈ  మసీదుతో ముడిపడి ఉన్న సిక్కు గురువు జ్ఞాపకాల కారణంగా గురు నానక్ యొక్క 550వ జయంతి సందర్భంగా సిక్కు సమాజం ఈ మసీదును మరమ్మతులు చేసి తెరిచింది".

కపూర్తాలా (పుంజాబ్) - సుల్తాన్పూర్ లోధి పట్టణంలో 550 సంవత్సరాల పురాతన మసీదును సిక్కు సమాజం, వారి మత పెద్దలు ముస్లింలకు అప్పగించారు, ఇది 1947 లో విభజన నుండి మూసివేయబడి శిధిలమైన స్థితిలో ఉంది. మసీదును మరమ్మతు చేసిన తరువాత, సిక్కు సమాజ సభ్యులు స్థానిక ముస్లింలను, ముస్లిం మత పెద్దలను రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి "శుక్రానా Shukrana " ప్రార్థనలు చేసి మసీదును ప్రారంభించడానికి ఆహ్వానించారు. ఈ మసీదుతో గురు నానక్ దేవ్ కు అనేక జ్ఞాపకాలు ఉన్నాయి. సిక్కు మతం వ్యవస్థాపకుడు గురు నానక్ దేవ్ ఈ మసీదులో నమాజ్ (ముస్లిం ప్రార్థన) చేశారని స్థానిక ప్రజలు అంటున్నారు.

గురు నానక్ దేవ్ యొక్క 550 వ జయంతి ఉత్సవాల సందర్భంగా మసీదును తిరిగి తెరవడానికి నిర్ణయం తీసుకున్నారు. సిక్కు, ముస్లిం మత పెద్దల సంయుక్త కార్యక్రమం మసీదులోనే జరిగింది, దీనిలో సిక్కు, ముస్లిం నాయకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి ముందు జరిగిన శుక్రవారం సముహ ప్రార్థనలకు "శుక్రానా" ప్రార్థనలు అని పేరు పెట్టారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో సిక్కు మత పెద్దలు సంత్ సుఖ్‌దేవ్ సింగ్, సంత్ బల్విందర్ సింగ్ ఉన్నారు. ముస్లిం వైపు నుండి జమాతే ఇ ఇస్లామి హింద్ (జెఐహెచ్), పంజాబ్ యూనిట్ ప్రెసిడెంట్ అబ్దుల్ షకూర్, మౌలానా సయ్యద్ ముజ్తాబా యజ్దానీ, డా. షాజాద్, డా. ఇర్షాద్ ఇతరులు పాల్గొన్నారు. పంజాబ్‌లోని ఏకైక ముస్లిం మెజారిటీ ప్రాంతమైన మలేర్‌కోట్ల నుండి పెద్ద సంఖ్యలో ముస్లింలు ఉమ్మడి కార్యక్రమానికి హాజరయ్యారు. 1947 తరువాత మొదటిసారిగా ప్రారంభించిన మసీదులో శుక్రవారం సమూహా ప్రార్థనలు చేశారు.

మాలెకోట్ల గురుద్వారాకు చెందిన జ్ఞానిఅవతార్ సింగ్ మాట్లాడుతూ, “ఇది చాలా మంచి కార్యక్రమం, ఇది ముస్లింలు, సిక్కులకు చాలా ముఖ్యమైనది. దశాబ్దాలుగా లాక్ చేయబడిన మసీదులో ముస్లింలు ప్రార్ధనలు చేసినందున వారికి  ఇది చాలా ముఖ్యమైనది, సిక్కులకు  గురు నానక్ దేవ్ ఈ మసీదులో నమాజ్ చేసినందువలన ఇది వారికి చాలా ముఖ్యమైనది ”.

గురు నాంక్ దేవ్ సాహిబ్ 550 వ జయంతి సందర్భంగా నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాలలో భాగంగా మసీదు ప్రారంభోత్సవం జరిగిందని JIH యొక్క అబ్దుల్ షకూర్ అన్నారు. "ఈ మసీదు స్థానిక కోట లోపల ఉంది మరియు 1947లో విభజన నుండి మూసివేయబడింది. ఈ మసీదుతో సిక్కు గురువుకు ఉన్న  జ్ఞాపకాల కారణంగా గురు నానక్ యొక్క 550 వ జయంతి సందర్భంగా సిక్కు సమాజం దీనిని తెరిచింది".

"గురు నానక్ దేవ్ సుల్తాన్పూర్ లోధీలో సుమారు 14 సంవత్సరాలు గడిపాడు. ఈ మసీదులో ప్రార్థనలు చేశాడు. ఆయనకు ముస్లింలతో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అతని శిష్యులలో ఒకరు ముస్లిం. ముస్లింలు, సిక్కులకు స్నేహపూర్వక చరిత్ర ఉంది ”అని అబ్దుల్ షకూర్ అన్నారు. 1947 లో విభజన తరువాత మూసివేయబడిన అనేక ముస్లిం మసీదులను  గత కొన్ని సంవత్సరాలుగా సిక్కు సమాజం మరమ్మతులు చేసి ముస్లింలకు అప్పగించినట్లు గుర్తు చేసుకోవచ్చు. సుల్తాన్పూర్ లోధీలోనే సిక్కు వ్యవస్థాపకుడు జ్ఞానోదయం పొందాడని, సిక్కు మత తత్వశాస్త్రం యొక్క కేంద్ర సిద్ధాంతమైన ఒకే సుప్రీం రియాలిటీ (ఇక్ ఓంకర్) ఇక్కడ మాత్రమే ఉందని ప్రకటించారు. వాస్తవానికి, సిక్కు పవిత్ర గ్రంథం గురు గ్రంథ్ సాహిబ్ "ఇక్ ఓంకర్ Ik Onkar " అనే పదాలతో ప్రారంభమవుతుంది.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరో వ్యక్తి జమీర్ అలీ జమీర్ మాట్లాడుతూ పవిత్ర ఖురాన్ లోని ఆయతులను పఠించడం ద్వారా ఈ కార్యక్రమం ప్రారంభమైంది. డా. గురు నానక్, ప్రవక్త మొహమ్మద్ (స) అనే అంశంపై ఇర్షాద్ మాట్లాడారు. డాక్టర్ షాజాద్ గురు నానక్ మానవ హక్కులపై మాట్లాడారు. గురు నానక్ మరియు ఇస్లాం అనే అంశంపై మౌలానా ముజ్తాబా యజ్దానీ మాట్లాడారు.

✍️ రచయిత-మహమ్మద్ అజ్గర్ అలీ 

రాజనీతి తత్వ శాస్త్ర విశ్రాంత అధ్యాపకులు

సెల్ నెం-94915-01910

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: