ప్రైవేట్, కార్పోరేట్ హాస్పిటళ్ల ఆర్ధిక దోపిడీ

బెంబేలెత్తుతున్న గ్రామీణ,  పట్టణ ప్రాంతాల ప్రజలు

ఓపీ, టెస్టులు అని వివిధ రకాల పేర్లతో నిలువుగా దోపిడి 

ఎఐవైఎఫ్ రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతున్న ఎఐవైఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు నాగరాముడు

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

ప్రైవేట్ , కార్పోరేట్ హాస్పిటళ్లలో ఓపీల పేరుతో, టెస్టుల పేరుతో, స్కానింగుల పేరుతో ప్రజల నుండి అక్రమ వసూళ్లు చేస్తున్న  హాస్పిటళ్లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బుధవారం ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో నంద్యాలలోని స్ధానిక సీపీఐ పార్టీ కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఏఐవైఎఫ్ పట్టణ  అధ్యక్షులు విష్ణు అధ్యక్షత వహించగా ముఖ్య అతిధిగా ఏఐవైఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు నాగరాముడు హాజరై మాట్లాడారు.ఈ సమావేశానికి వివిధ విద్యార్ధి , యువజన, ప్రజా సంఘాల నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు నాగరాముడు, ప్రసాదు,   శ్రీనివాసులు, సుబ్బరాయుడు, సోమన్న , రాజునాయుడు, రామచంద్రుడు, ఓబులేసులు మాట్లాడుతూ ఏదో సామెత అన్నట్లుగా ప్రభుత్వాసుపత్రులు సేవలు సరిగా చేస్తే ప్రైవేట్, కార్పోరేట్ హాస్పిటళ్లు పుట్టగొడుగుల్లా ఎందుకు వెలుస్తాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అంతే కాకుండా మనిషి జీవితంలో తిండి, వైద్యం, చదువు ఈ మూడు విషయాలకు మానవుడు ఆరాట పడుతూ జీవిస్తుంటాడనీ, అలాంటిది పేద మధ్య ధనిక అని భేధం లేకుండా వైద్యాన్ని ఆసరాగా చేసుకొని ప్రైవేట్, కార్పోరేట్ హాస్పిటళ్లను కోట్ల రూపాయలు వెచ్చించి హాస్పిటళ్లు నిర్మించి ప్రజలను రక్షించాల్సింది పోయి భక్షించే వారిలా వెలిశాయన్నారు.
ఈ భూమ్మీద డాక్టర్లను ప్రత్యక్ష దైవంగా చూస్తారనీ, అలాంటిది రోగి మానసిక స్థైర్యాన్ని ఆసరాగా చేసుకొని వివిధ రకాల ఫీజులు,  ఓపీల పేర్లతో డబ్బులు వసూలు చేస్తున్నారన్నారు. నంద్యాలలోని చాలా వరకు కొన్ని ప్రైవేట్,  కార్పోరేట్ హాస్పిటళ్లలో ఓపీల పేరుతో, టెస్టుల పేర్లతో ఇచ్చేవాడు ఉంటే చచ్చిన వాడు కూడా వచ్చి డబ్బులు తీసుకున్నట్లు వీరు తీరుందన్నారు. అనంతరం ఆయా విద్యార్ధి , యువజన సంఘాల నాయకులు శివ , లక్ష్మణ్ , రాంబాబు , వెంకట్ , రియాజ్, బాలాజీ , నాగన్న , ఆకుమళ్ల శ్రీధర్ , విజయ్ , వేణుమాధవ రెడ్డి , దస్తగిరి మాట్లాడుతూ ఈ ప్రైవేట్ , కార్పోరేట్ హాస్పిటల్ల ధన దాహానికి వ్యతిరేఖంగా పోరాటాలు సాగించే క్రమంలో ప్రత్యక్షంగా పాల్గొంటామనీ నాయకులు అందరూ కలిసి మక్త కంఠంగా అభివాదం చేశారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: