కార్మిక, ప్రజా, రైతు వ్యతిరేక విధానాన్ని నిరసిస్తూ...
నూనెపల్లెలోని కోయిలకుంట్ల జంక్షన్లో రహదారుల దిగ్బంధం
సీపీఐ నేతల వెల్లడి
(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)
కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక ప్రజా రైతు వ్యతిరేక విధానాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు సమ్మె పిలుపుమేరకు సమ్మెకు మద్దతుగా సిపిఐ పార్టీ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఈరోజు నంద్యాల పట్టణంలో సిపిఐ పార్టీ పట్టణ సమితి ఆధ్వర్యంలో నూనెపల్లె లోని కోవెలకుంట్ల జంక్షన్లో రహదారుల దిగ్బంధం నిర్వహించడం జరిగిందని సిపిఐ పార్టీ నియోజకవర్గ కార్యదర్శి ఎస్ బాబా ఫక్రుద్దీన్ సిపిఐ పార్టీ పట్టణ కార్యదర్శి కె ప్రసాద్ సహాయ కార్యదర్శి ఎస్ షరీఫ్ బాష సిపిఐ పార్టీ గోస్పాడు మండలం కార్యదర్శి చెన్నయ్య సిపిఐ నాయకుడు శ్రీనివాసులు వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి సుబ్బరాయుడు రైతు సంఘం కార్యదర్శి సోమన్న తెలిపారు.
అనంతరం వారు మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసి పెట్టుబడిదారులకు ఉపయోగకరంగా మార్చుతున్నారు 8 గంటల పని విధానాన్ని 12 గంటలకు మార్చు చున్నారు డీజిల్ పెట్రోల్ ధరలు పెంచి నిత్యావసర సరుకుల ధరలకు రెక్కలు వచ్చేటట్లు చేస్తూ ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తున్నారు రైతుల భవిష్యత్తును కార్పొరేట్ శక్తులకు అప్ప చెబుతున్నారు లాభాల బాటలో నడుస్తున్న రైల్వే BSNL బ్యాంక్ ఎల్ఐసి తదితర సంస్థలను ప్రైవేటు వారికి దారాదత్తం చేసే ప్రయత్నం చేస్తున్నారు నాడు కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సీజ్ బ్యాంకులలో నిల్వ ఉన్న నల్లధనాన్ని బయటికి తెచ్చి దేశంలో ఉన్న ప్రతి పేదవాని అకౌంట్లో 15 లక్షలు వేస్తానని చెప్పినారు పెద్ద నోట్ల రద్దు అని ప్రజలను అనేక ఇబ్బందుల పాలు చేసినారు ఇలా కార్మిక ప్రజా రైతు వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని నినాదాలు చేస్తూ రహదారుల దిగ్బంధ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఐ ఏఐటీయూసీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Post A Comment:
0 comments: