టెక్కె మార్కెట్ యార్డు క్రికెట్ ప్లెయర్స్ ఆధ్వర్యంలో..

దుప్పట్లు పంపిణీ

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

టెక్కె మార్కెట్ యార్డు క్రికెట్ ప్లెయర్స్ టీం ఆటల్లోనే కాదు తమ మానవతా హృదయాన్ని చాటారు. ఈ టీంలో యువకులు, ఉద్యోగులు, వ్యాపారులు ఉన్నారు. అడపా దడపా పేదలకు సహాయం చేస్తుంటారు. కరోనా కాలంలోను రైల్వే స్టేషన్ తదితర చోట్ల అన్నం పాకెట్లు పంచారు. ఈ నేపధ్యంలో రాత్రి చలిలో రైల్వే స్టేషన్, బస్టాండ్,  రోడ్డు సైడు తల దాచుకుంటున్న నూటవక్కమందికి కప్పుకోవడానికి దుప్పట్లు పంపిణి చేసారు.
ఈ కార్యక్రమంలో రైల్వే పి. సి. రహమత్ ఆధ్వర్యంలో నరేంద్ర, మస్తాన్, కాశి, నదీమ్, శ్రీనాథ్, పఠాన్, శివా పాల్గొన్నారు. వీరి కృషిని జమాఆతె ఇస్లామీ నంద్యాల శాఖ కార్యదర్శి అబ్దుల్ సమద్ అభినందిస్తూ సామాజిక సేవలో ఉన్న తృప్తి అపారమైనదని, ఇలాంటి వారి హృదయాలు నిర్మలంగా ఉంటాయని మానవ సేవే మాధవ సేవ అని వక్కాణించారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: