డాక్టర్ ఏలూరి ఆధ్వరంలో...

రఘునందన్ దిష్టిబొమ్మ దహనం

(జానోజాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

దివగంత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా వైసీపీ రాష్ట్ర నాయకుడు డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి ఆధ్వరంలో రఘునందన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. వైఎస్ అభిమానులు. సోమవారం మధ్యాహ్నం.. కూకట్ పల్లి ప్రశాంతి నగర్ లోని వైఎస్ఆర్ విగ్రహం వద్దకు భారీగా చేరుకున్న మహానేత అభిమానులు రఘునందన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసనలను హోరెత్తించారు.



 ఈ సందర్బంగా మాట్లాడిన డాక్టర్ ఏలూరి..  ఎమ్మెల్యే రఘునందన్ వ్యాఖ్యలపట్ల తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి 13 కోట్ల మంది  తెలుగు ప్రజలకు ఆరాధ్యదైవం వైఎస్ఆర్  గారు.. ఇవాళ్టికి కులమతాలకు అతీతంగా ఆయనను దేవుడిగా కొలుస్తారు.. అలాంటి  గొప్ప వ్యక్తిని పట్టుకొని.. రఘునందన్ దారుణంగా మాట్లాడారని.. భవిశ్యత్ లో ఆయనకు తామేంటో చూపిస్తామని సవాల్ విసిరారు. ఎమ్మెల్యే అన్న మదంతో రఘునందన్ ఇష్టంవచ్చినట్లు మాట్లాడితే నాలుక కోస్తామని హెచ్చరించారు. వైఎస్ అభిమానులు తలుచుకుంటే.. సింపతీ ఓట్లతో గెలిచిన రఘునందన్ కు రాజకీయ భవిశ్యత్ లేకుండా చేస్తారని చెప్పారు. దిష్టిబొమ్మ దహనం సందర్బంగా  ఆ ఏరియాలో కాసేపు ట్రాఫిక్ జామ్ అయింది. మరోవైపు ఎమ్మెల్యే రఘునందన్ కూడా వైఎస్ అభిమానులకు క్షమాపణలు చెప్పారు.







 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: