సాదక్ బాషా ను బెదిరించిన వారిపై....
కేసు నమోదు చేయాలి
సిపిఐ డిమాండ్
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సాదక్ బాషాను
పరామర్శిస్తున్న సీపీఐ నేతలు
(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)
ఆత్మహత్య చేసుకొనేలా సాదక్ భాషను ప్రేరేపించి, అందుకు కారణమైన వారిపై కేసు నమోదు చేయాలని సీపీఐ నేతలు డిమాండ్ చేశారు. నంద్యాల శివారు ప్రాంతంలోని నందమూరి నగర్ కు చెందిన సిపిఐ నాయకులు హుస్సేన్ సా కుమారుడు సాదక్ భాషను కుటుంబంలో ఉన్న తగా దను ఆసరా చేసుకుని కర్నూలు నగరానికి చెందిన కొంతమంది పెద్ద మనుషులు చలామణి అవుతూ నీ కుటుంబంలో సమస్య తీరాలంటే 10 లక్షలు ఇస్తావా కేసు నమోదు చేయాల అని బెదిరించడంతో భయపడి పురుగుల మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేసుకోవడం బాధాకరమని ఇలాంటి బెదిరింపులకు పాల్పడ్డాడు పెద్దమనుషుల గా వచ్చిన వారిపై కేసు నమోదు చేయాలని సిపిఐ పట్టణ కార్యదర్శి.కె. ప్రసాద్. సిపిఐ నాయకులు డి శ్రీనివాసులు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం. కార్యదర్శి ఏ. సుబ్బరాయుడు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కార్యదర్శి. జి. సోమన్న. సిపిఐ నాయకులు ఎస్ మా భాష. డిమాండ్ చేశారు. ఆత్మహత్యాయత్నం చేసుకుని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సాదక్ భాషను సిపిఐ నాయకులు పరామర్శించారు.
ఈ సందర్భంగా పై నాయకులు మాట్లాడుతూ నంద్యాల శివారు ప్రాంతంలోని నందమూరి నగర్ కు చెందిన సిపిఐ నాయకులు హుస్సేన్ భాష కుమారుడు సాదక్ భాషకు కర్నూల్ నగరంలోని రోజా దర్గా కు చెందిన హసీనా కుమార్తెను మూడు సంవత్సరాల క్రితం వివాహం చేసుకోవడం జరిగిందని వారికి ఒక కుమార్తె పుట్టిన తర్వాత ఒక సంవత్సరం నుండి భార్యాభర్తల మధ్య మనస్పర్థలు భార్య కర్నూలుకు పుట్టింటికి వెళ్లడం జరిగింది తర్వాత సాదక్ బాషా తన భార్య కోసం అత్తారింటికి వెళ్ళిన భార్య తరుపున బంధువులు అతనిపై చేయి చేసుకోవడం జరిగింది. అయినా భరించి సంసారం చేస్తామని ఎంత చెప్పినా వినకుండా భార్య భర్తను కాపురం నిలబెట్టాలన్న పెద్దమనుషులు ఇంగిత జ్ఞానం లేకుండా వచ్చిన పెద్ద మనుషులు 10 లక్షలు డబ్బులు ఇస్తావా లేకుండా నీ పైన కేసు పెట్టాలని అని బెదిరించడంతో సాదిక్ భాషా ఆత్మహత్యయత్నానికి పాల్పడడానికి కారణమైన పెద్దమనుషుల పైన కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
Post A Comment:
0 comments: