మాజీ ఎంపీ మేకపాటితో...

వైసీపీ నేతలు జంకే వెంకట రెడ్డి, ఏలూరి భేటీ

(జానోజాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

వైసీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డిని మాజీ ఎమ్మెల్యే, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంకే వెంకట రెడ్డి గారు, రాష్ట్ర నాయకులు డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి కలిశారు. మంగళవారంనాడు హైదరాబాద్ లో మేకపాటి రాజమోహన్ రెడ్డిని ఆయన నివాసంలో వారు కలిశారు. ఈ సందర్భంగా ఏపీలోని రాజకీయ పరిస్థితులపై వారు చర్చించుకొన్నారు. ప్రకాశంజిల్లాలోని వైసీపీ పార్టీ పరిస్థితిపై మేకపాటి రాజమోహన్ రెడ్డి ఆరా తీశారు. పశ్చిమ ప్రకాశంలోని గిద్దలూరు, మార్కాపురం, యర్రగుంట పాలెం పురోగతికి తన వంతు సహకారం అందిస్తానని జంకే వెంకట రెడ్డి, ఏలూరి రామచంద్రారెడ్డికి మేకపాటి హామీ ఇచ్చారు. 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: