కన్నుల పండువగా..
టీయూడబ్ల్యూజే నేత గోలి విఠల్ కుమారుడు వివాహం
టీయూడబ్ల్యూజే నేత గోలి విఠల్ కుమారుడి వివాహానికి హాజరైన ఎడిటర్ కె. శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ, ఆంధ్రభూమి చీఫ్ సబ్-ఎడిటర్, నంది అవార్డు గ్రహీత, ఎం.డి అబ్దుల్, సీనియర్ జర్నలిస్టులు మల్లయ్య, దుంపల రవికుమార్
(జానోజాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)
సీనియర్ పాత్రికేయుడు, టీయూడబ్ల్యూజే నాయకుడు గోలి విఠల్ కుమారుడు విశ్వశ్రీ హర్ష - రాజేశ్వరీల వివాహం శుక్రవారం హైదరాబాద్ లోని దమ్మాయిగూడ బేవేరియా హోటల్ లో ఘనంగా జరిగింది. ఈ వివాహ మహోత్సవానికి ఎడిటర్ కె. శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ, ఆంధ్రభూమి చీఫ్ సబ్-ఎడిటర్, నంది అవార్డు గ్రహీత, ఎం.డి అబ్దుల్, సీనియర్ పాత్రికేయులు గురుప్రసాద్, మల్లయ్య, కులశేఖర రెడ్డి, కోటగిరి దైవాధీనం, సుకుమార్ , దుంపల రవికుమార్ తదితరులు హాజరై కల్యాణ మహోత్సవాన్ని తిలకించి నూతన దంపతులను ఆశీర్వదించారు. ఈ వివాహ వేడుక కన్నుల పండువగా జరిగింది. ఈ వివాహ మహోత్సవానికి బంధు మిత్రులు సపరివార సమేతంగా విచ్చేసి కల్యాణ మహోత్సవమును తిలకించి నూతన వధూవరులను ఆశీర్వదించారు.
Post A Comment:
0 comments: