రైతులను తక్షణమే ఆదుకోవాలి 

 దెబ్బతిన్న పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేసి మద్దతు ధర ఇవ్వాలి 

సీపీఐ గోస్పాడు మండల కార్యదర్శి ఇ చెన్నయ్య డిమాండ్ 

(జానోజాగో వెబ్ న్యూస్-గోస్పాడు ప్రతినిధి)

 గోస్పాడు మండలంలో నివర్  తుఫాన్ వల్ల పంటలు పూర్తిగా దెబ్బతిని నష్టపోయిన రైతులను తక్షణమే ఆదుకోవాలని సిపిఐ పార్టీ గోస్పాడు మండల కార్యదర్శి ఇ  చెన్నయ్య డిమాండ్ చేశారు. శుక్రవారంనాడు స్థానిక గోస్పాడులో సిపిఐ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సిపిఐ పార్టీ గోస్పాడు మండల కార్యదర్శి ఇ చెన్నయ్య మాట్లాడుతూ గోస్పాడు మండలంలోని రైతులు ప్రతి సంవత్సరం అతివృష్టి అనావృష్టి వల్ల ఆరుగాలం కష్టించి పండించిన పంటలు చేతికి రాక ప్రతి సంవత్సరం అప్పులపాలవుతున్నారన్నారు. కానీ ఇప్పుడు ఈ సంవత్సరం వర్షాలు సకాలంలో పడి పంటలు బాగా ఉన్నాయని ఆనంద పడుతున్న తరుణంలో నివర్ తుఫాన్ వల్ల గాలివానకు వందల ఎకరాల్లో వరిపంటలు చాలా చోట్ల నేలకు వరగడం జరిగిందిని, మరికొన్నిచోట్ల వరి పంటను కోసి కల్లాలల్లో ధాన్యాన్ని అరపెట్టుకోవడానికి ఉంచుకోవడం వలన ధాన్యం మొత్తం నీట మునిగి పోయి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆత్మహత్యలే  శరణ్యం అని అంటున్నారు కాబట్టి ప్రభుత్వమే దెబ్బతిన్న పంటల ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులకు మద్దతు ధర ఇవ్వాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ గోస్పాడు మండలం సమితి డిమాండ్ చేస్తున్నామన్నారు. లేనిపక్షంలో మండలంలోని నష్టపోయిన రైతులందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సమాఖ్య మండల కార్యదర్శి ఎరుకలి నాసరి నరసింహులు పసురపాడు శాఖ కార్యదర్శి జిలాన్ భాష ప్రాసాద్ కరుణాకర్ రంగ మద్దిలేటి తదీతర నాయకులు పాల్గొన్నారు 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: