మైనార్టీలు భారతీయులు కారా

రాజ్యాంగ పరిధిలోకి  రారా 

మైనార్టీలపై లైంగిక,భౌతిక దాడులు తక్షణమే ఆపాలి

దూదేకుల ఫెడరేషన్ మాజీ చైర్మన్ డా.బాబాన్      

సమావేశంలో మాట్లాడుతున్న డాక్టర్ బాబాన్

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

నంద్యాల లో మైనార్టీ కుటుంబం సమస్య సద్దుమణగకముందే, అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ప్రాంతంలో షాహిదా  అత్యాచార, హత్య సంఘటన జరగడం చాలా ఘోరమని అత్యాచారం చేసి,హత్య చేసిన నిందితులను ఎన్కౌంటర్ చేయాలనే డిమాండ్ తో శుక్రవారం నంద్యాల దూదేకుల సంఘము అధ్యక్ష కార్యదర్సులు ఖాసీం, డీడీజి  దస్తగిరిల ఆధ్వర్యంలో డా.బాబాన్ నూర్ నర్సింగ్ హోమ్ ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో డా.బాబన్ మాట్లాడుతూ అనంతపురం జిల్లా, కళ్యాణదుర్గం మండలం, చాపిరి గ్రామ వాస్తవ్యురాలైన దూదేకుల షాహిదాను అదే గ్రామానిక చెందిన రఘ, ఇంకో నలుగురు దుర్మార్గులు అతి కిరాతకంగా, పైశాచికంగా, రాక్షసంగా అత్యాచారానికి పాల్పడి కాలువలో తోసి  అమ్మాయిని చంపడం మమ్మల్ని దిగ్భ్రాంతికి మరియు ఆవేదనకు గురి చేసింది. ఈ చర్య మానవజాతికే సిగ్గుచేటని,  ఇలాంటి చర్యకు పాల్పడిన ఆ ఐదుగురిని వెంటనే కఠినంగా శిక్షించి షాహిదా కుటుంబానికి న్యాయం చేయాలి. రాబోవు కాలంలో ఇలాంటి తప్పుడు పనులు చేయాలంటే భయపడే విధంగా ఈ ఐదుగురిని శిక్షించాలన్నారు. ప్రభుత్వం తక్షణం స్పందించి షాహిదా కుటుంబానికి న్యాయం చేయాలని, అలాగే షాహిదాను చంపిన దుర్మార్గులను తప్పక శిక్షపడేలా చర్యలు తీసుకొవాలని కోరారు. అలాగే ఈ సందర్బంగా ఈ చర్యను ఖండిస్తూ దూదేకుల షాహిదా ఆత్మకు శాంతి చేకూరాలని మరియు షాహిదా కుటుంబానికి రాష్ట్ర దూదేకుల సంక్షేమ సంఘం అండగా ఉంటుందని ఆ కుటుంభానికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆ అల్లాహ్ ను ప్రార్థిస్తున్నామన్నారు. అలాగే నంద్యాల అబ్దుల్ సలాం కుటుంబానికి న్యాయం జరగాలని ఇలాంటి సంఘటనలను రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ స్పందించాలని కోరారు. ఈ సమావేశంలో ఖాసీం, ddg దస్తగిరి, నూర్ బాష, పర్ల దస్తగిరి, బాబు, ఆదాం, రసూల్, హసన్, డిజిటల్ దస్తగిరి తదితరులు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: