కార్మిక వ్యతిరేక విధానాలను నిరసనగా

సీఐటీయూ ర్యాలీ

(జానోజాగో వెబ్ న్యూస్-తర్లుపాడు)

ప్రకాశంజిల్లా  తర్లుపాడు మండల కేంద్రం నందు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న  కార్మిక వ్యతిరేక విధానాలను  నిరసిస్తూ తర్లుపాడు మండల సీఐటీయూ ఆధ్వర్యంలో  స్థానిక బస్టాండ్ నుండి  స్థానిక ఎమ్మార్వో కార్యాలయం వరకు  ర్యాలీ నిర్వహించారు, అనంతరం తాసిల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది. మరియు తాసిల్దార్ కు వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా  కెవిపిఎస్ జిల్లా కన్వీనర్ జవ్వాజి  రాజు  మాట్లాడుతూ  కేంద్ర ప్రభుత్వం కార్మికుల  పొట్ట కొట్టి   కార్పొరేట్ల జేబులు  నింపుతుంది.    అని ఆయన   దుయ్యబట్టారు.   కేంద్ర ప్రభుత్వం కీలకమైన  ప్రభుత్వ సంస్థలను  పరిశ్రమలను పెట్టుబడిదారులకు   అమ్మేస్తున్నారు అని  ఆయన అన్నారు.   ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న  అంగనవాడి, ఆశ, మధ్యాహ్నం భోజనం, స్వచ్ఛభారత్,  ఐకేపీ స్కీం, వర్కర్స్ కు కనీసం చట్టాలను అమలు చేయకుండా  వారిచేత  వెట్టిచాకిరి చేసుకుంటున్నారని   వారిని రిటైర్మెంట్ బెనిఫిట్  కల్పించాలని  ఈ సందర్భంగా తెలియజేశారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: