పాలకుడు అంటే ఇలా
జీవనోపాధి కోసం ఖురాన్ ను చేతితో రాసి అమ్మిన ఔరంగజేబు
చక్రవర్తి ఔరంగజేబు చేతి వ్రాత ఖురాన్ ను సేకరించిన టిప్పు సుల్తాన్...ఆ ప్రతి బ్రిటిష్ లైబ్రరీలో నేటికీ భధ్రంగా
Emperor Aurangzeb's Quran from Tipu Sultan's Collection is in the British Library:
కార్పోరేటర్ అయితే చాలు నేడు కోట్లకు పడిగేడుతున్న వైనం. ఇంక ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి ఇక వీరి గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కానీ చరిత్ర వక్రీకరణ కారణం ఔరంగజేబు గురించి రకరకాల విమర్శలు ప్రచారంలోవున్నాయి. ఇస్లాం జీవిన విధానంను తూచతప్పకుండా పాటించే ఆయన తన నిజజీవితంలో ఇస్లాం సూచించిన పాలకుడు ఎలా ఉంటారో కూడా ఆయన ఆచరణలో చూపారు. రాజు తలచుకొంటే దెబ్బలకు కొదవ, వైభవ ప్రదర్శనకు కొదవ అన్నది మనం వినేవుంటాం. నాడు ఔరంగజేబు రాజు హోదాకు మించి చక్రవర్తి హోదాను కలిగివున్నారు. కానీ ఆయన జీవనం మాత్రం ఎంతో ఆదర్శంగా ఉండేది. తన రాజ్య ఖజానా నుంచి ఆయన జీవనం కోసం ఒక్కరూపాయి కూడా వాడలేదు. తానే స్వయంగా చేతి వ్రాత ద్వారా రాసిన ఖురాన్ లను అమ్మి వాటి ద్వారా వచ్చే ఆధాయంతో ఆయన తన జీవనం గడిపేవారు. ఇది వినేవారికి కొంత ఆశ్చర్యం కలిగించినా అది నిజమని చెప్పడానికి ఎన్నో ఆధారాలు నేటికి సజీవంగా ఉన్నాయి. వాటిలో చక్రవర్తి ఔరంగజేబు చేతి వ్రాత ఖురాన్ ను టిప్పు సుల్తాన్ సేకరించారు. ఆ ప్రతి బ్రిటిష్ లైబ్రరీలో నేటికీ భధ్రంగా ఉంది.
మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు కు కాలిగ్రాఫి లో అద్భుతమైన నైపుణ్యం ఉంది. అతను దివ్య ఖురాన్ చేతితో కాపీ చేసి దానిని అమ్మి తన జీవనోపాధి కోసం డబ్బు సంపాదించేవాడు. ఔరంగజేబ్ చక్రవర్తి తన వ్యక్తిగత ఖర్చుల కోసం ఎప్పుడు ప్రభుత్వ ఖజానా నుండి డబ్బు తీసుకోలేదని, తన సొంత కాలిగ్రాఫి నైపుణ్యాన్ని విక్రయించేవాడు అని చారిత్రిక పత్రాలలో నమోదు చేయబడింది.
టిప్పు సుల్తాన్ తన గ్రంథాలయంలో పవిత్ర ఖురాన్ కాపీని ఉంచాడు. ఇది ఔరంగజేబ్ చేత కాపీ చేయబడింది. ఔరంగజేబుకు చెందినది. టిప్పు సుల్తాన్ యుద్ధం లో అమరవీరుడైనప్పుడు అతని వ్యక్తిగత గొప్ప గ్రంథాలయం ఇతర నిధులతో పాటు బ్రిటిష్ వారు దానిని దోచుకొన్నారు. బ్రిటిష్ పాలకులు టిప్పూ సాహెబ్‌కు సంబంధించిన దాదాపు ప్రతిదీ (ఫ్రెంచ్ వారు అతన్ని టిప్పూ సాహెబ్ అని పిలిచేవారు) ఇంగ్లాండ్‌కు రవాణా చేశారు. టిప్పు సుల్తాన్ పుస్తక సేకరణలో అరుదైన ఖురాన్ మాన్యుస్క్రిప్ట్‌లు ఉన్నాయి. అందులో దివ్య ఖురాన్ యొక్క అతని వ్యక్తిగత కాపీ, ఔరంగజేబ్ కాపీ చేసిన ఖురాన్ ఉన్నాయి. అతని వ్యక్తిగత లైబ్రరీలో 25% బ్రిటిష్ లైబ్రరీ - లండన్ లో ఉంది.
టిప్పు సుల్తాన్
రిఫరెన్స్:
1.హిజ్ మెజెస్టి లైబ్రరీ కోసం,
ది లైబ్రరీ ఆఫ్ ది లేట్ టిప్పూ సుల్తాన్: "ఈ ఖురాన్ ఔరంగజేబ్ చక్రవర్తికి చెందినది. టిప్పు సుల్తాన్ యువరాజు తొమ్మిది వేల రూపాయలకు దానిని కొనుగోలు చేశాడు."
2.శ్రీరంగపట్నం లో బందీలుగా ఉన్న బ్రిటిష్ వారి నివేదిక.
౩.కాలేజ్ ఆఫ్ ఫోర్ట్ విలియం 15 ఆగస్టు 1805
4.లైబ్రరీ ఈస్ట్ ఇండియా హౌస్ 4 ఫిబ్రవరి 1807.
✍️ రచయిత-సల్మాన్ హైదర్
Post A Comment:
0 comments: